
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి ఆటగాడైన శ్రీలంక క్రికెటర్ ధనుంజయ డి సిల్వా ఇంట విషాదం అలముకుంది. స్థానికంగా రాజకీయ నాయకుడైనటువంటి అతని తండ్రిపై గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో డి సిల్వా తండ్రిని కోల్పోయాడు. ఈ ఘటన కొలంబోకు సమీపంలో ఉన్న రత్‌మలాన్ ప్రాంతంలో జరిగింది.
వెస్టిండీస్ టూర్ కోసం క్రికెటర్ ధనంజయ్ డిసిల్వా పయనమవుతున్న సమయంలో ఈ దారుణం చోటుచేసుకున్నది. ధనంజయ్ తండ్రి రంజన్.. స్థానికంగా ఓ రాజకీయ నేత. అయితే ఆ మర్డర్ కేసులో విచారణ నిర్వహిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో మూడు టెస్టుల విండీస్ టూర్ నుంచి ధనంజయ్ తప్పుకున్నాడు.
ఈ విషయంపై శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ఎటువంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. డి సిల్వా స్థానంలో ఎవర్ని రిప్లేస్ చేస్తారన్న విషయాన్ని కూడా ఇంకా వెల్లడించలేదు. మరో పక్క శ్రీలంక ఓపెర్ దిముత్ కరుణ రత్నే చేతి వేలి గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైయ్యాడు.
ఐపీఎల్‌కు ముందు మార్చి నెలలో శ్రీలంక వేదికగా శ్రీలంక, భారత్, బంగ్లాదేశ్‌లు నిదహాస్ ట్రోఫీ కోసం తలపడ్డాయి. ఈ ట్రోఫీని భారత్ దక్కించుకుంది. కాగా, ప్రస్తుతం శ్రీలంక జట్టు టెస్టు మ్యాచ్ నేపథ్యంలో జూన్ 6వ తేదీ నుంచి వెస్టిండీస్‌తో తలపడనుంది.