'Fat and unfit': పాక్ కెప్టెన్‌ను ఉద్దేశించి షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: నాటింగ్‌హామ్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోవడాన్ని ఆ దేశ క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తగా ఓడించింది. ముఖ్యంగా విండిస్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనడంలో పాకిస్థాన్ ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
దీంతో పాకిస్థాన్ 21.4 ఓవర్లకు 105 పరుగులకు కుప్పకూలింది. పాకిస్థాన్‌కు ఇది వరల్డ్‌కప్‌లో రెండో అత్యల్ప స్కోరు. పాకిస్థాన్ చెత్త ఓటమిపై ఆ దేశ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో జోకులు వేస్తుండగా... తాజాగా ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్... పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

పొట్ట బయటకు వచ్చి అసహ్యంగా
"సర్ఫరాజ్ అహ్మద్ టాస్‌కి వస్తోన్న సమయంలో కొవ్వు పేరుకుపోయిన అతని పొట్ట బయటకు వచ్చి అసహ్యంగా కనిపించింది. నేను చూసిన మొదటి అన్‌ఫిట్ కెప్టెన్ సర్ఫరాజే. అతను కొవ్వుతో కదల్లేకపోతున్నాడు. వికెట్ కీపింగ్ సమయంలోనూ ఇబ్బంది పడటం కనిపించింది" అని అక్తర్ చెప్పనట్లు పాక్ జర్నలిస్ట్ సాదిక్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసాడు.
షోయబ్ అక్తర్ మాత్రం
అయితే, షోయబ్ అక్తర్ మాత్రం "మాటల్లేవ్... మ్యాచ్ అయిపోయింది.. నా ఆలోచనలు భావోద్వేగాలను మరోసారి నెమరువేసుకుంటున్నా. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లకు మనమంతా అండగా నిలవాలి. టోర్నీ ఆసాంతం మన మద్దతు వారికి అవసరం. తొలి మ్యాచ్ ఓటమి నిరాశకు గురి చేసింది. ఇక, వారిని మరింత బాధపెట్టకుండా మద్దుతుగా నిలుద్దాం" అని మూడు వరుస ట్వీట్లు చేశాడు.

సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం ఇలా
మరోవైపు సర్ఫరాజ్ అహ్మద్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. "ఇలాంటి మెగాటోర్నీలో ప్రారంభ మ్యాచ్‌లో ఎంత బాగా ఆడితే అంత ఆత్మ విశ్వాసం వస్తుంది. ఈ మ్యాచ్‌లో ఆట ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం మా మీద కాస్త ప్రభావం చూపింది. ఎన్నో అంచనాలతో మైదానంలోకి దిగినప్పటికీ అక్కడ మేం అనకున్నది జరగలేదు" అని అన్నాడు.

రానున్న మ్యాచ్‌ల్లో రాణిస్తాం
అంతేకాదు ఛాంపియన్స్ ట్రోఫీ 2017లో కూడా భారత్ చేతిలో తొలుత ఓడామని కానీ ఫైనల్లో గెలిచి టైటిల్ సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశాడు. ఈ దారుణ ఓటమి నుంచి తమ ఆటగాళ్లు కోలుకుంటారని, టైటిల్ పోరులో నిలుస్తారనే నమ్మకం తనకు ఉందని, టోర్నీలో ఇంకా 8 మ్యాచ్‌లున్నాయని వాటిల్లో తప్పగ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications