For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టుల్లో అత్యంత వేగంగా 18 సెంచరీలు: పుజారా మరో రికార్డు

Fastest Indian to 18 Test tons in test cricket

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పుజారా పరుగుల వరద పారిస్తోన్న సంగతి తెలిసిందే. సిడ్నీ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఛటేశ్వర్ పుజారా అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 18 సెంచరీలు(తక్కువ ఇన్నింగ్స్‌ల్లో) సాధించిన నాలుగో భారత ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందాడు.

గురువారం ఆరంభమైన నాలుగో టెస్టు మ్యాచ్‌లో కేవలం 199 బంతుల్లోనే 13 ఫోర్ల సాయంతో ఛటేశ్వర్ పుజారా సెంచరీ సాధించాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో బంతిని బౌండరీకి పంపడంతో పుజారా 100 పరుగులను పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 18వ సెంచరీ కాగా, ఈ సిరిస్‌లో మూడోది కావడం విశేషం.

దీంతో టెస్టుల్లో 18 సెంచరీలు చేసేందుకు గాను అతి తక్కువ ఇన్నింగ్స్‌లు తీసుకున్న నాలుగో భారత ఆటగాడిగా పుజారా నిలిచాడు. ఈ జాబితాలో సునీల్ గవాస్కర్(82 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా, మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (99), టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(103) మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

1
43626

114 ఇన్నింగ్స్‌లతో పుజారా నాలుగో స్థానంలో నిలవగా, టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్(121)లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. సిడ్నీ టెస్టులో మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పడుతున్నప్పటికీ పుజారా మాత్రం నిలకడగా ఆట కొనసాగించాడు. ఈ క్రమంలో పుజారా మరో రికార్డుని నెలకొల్పాడు.

మూడో స్థానంలో వచ్చిన బ్యాట్స్‌మన్లలో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా పుజారా అరుదైన రికార్డు నెలకొల్పాడు. మూడో స్థానంలో వచ్చిన ఓ బ్యాట్స్‌మన్‌ ఒకే సిరీస్‌లో మూడు సెంచరీలు పూర్తి చేసుకోవడం కూడా ఇదే తొలిసారి. పుజారా సెంచరీ, ఓపెనర్ మయాంక్ అగర్వాల్(77) హాఫ్ సెంచరీతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది.

Story first published: Thursday, January 3, 2019, 15:50 [IST]
Other articles published on Jan 3, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+