For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌కు వీడ్కోలు: ఆడిన రెండు మ్యాచ్‌ల్లో వికెట్లు తీయలేకపోయాడు

By Nageshwara Rao
Ashish Nehra opens up about retirement from cricket | Oneindia News
Fast Bowler Parvinder Awana Retires From All Forms of Cricket

హైదరాబాద్: ఢిల్లీ పేస్ బౌలర్ పర్వీందర్ అవానా అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. టీమిండియా తరఫున రెండు టి20 మ్యాచ్‌లు ఆడిన పర్వీందర్‌ అవానా చివరిసారిగా 2016 నవంబర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు.

ఇదే సరైన సమయం అని అనుకుంటున్నా

ఈ సందర్భంగా ట్విటర్‌లో "టీమిండియా, దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ(డీడీసీఏ)కి ప్రాతినిధ్యం వహించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. నా స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ఇదే సరైన సమయం అని అనుకుంటున్నాను. నా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు అవకాశం ఇచ్చి, ప్రోత్సహించిన డీడీసీఏ సెలక్టర్లకు, సీనియర్లకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎల్లవేళలా నాకు మద్దతుగా నిలిచిన, క్రికెట్ జర్నీలో భాగమైన ప్రతిఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను" అని పేర్కొన్నాడు.

భారత తరఫున ఇంగ్లాండ్‌పై 2012లో అరంగేట్రం

భారత తరఫున ఇంగ్లాండ్‌పై 2012లో అరంగేట్రం

భారత తరఫున ఇంగ్లాండ్‌పై 2012లో అరంగేట్రం చేసిన ఆవానా ఆడిన రెండు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనూ వికెట్‌ తీయలేకపోయాడు. అవానా త్వరలోనే తన 32వ పుట్టినరోజును జరుపుకోనున్నాడు. ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల అవానా రంజీ జట్టుకు తొమ్మిదేళ్లు ప్రాతినిధ్యం వహించాడు.

సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు

సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు

2012లో సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రెండు టీ20 మ్యాచ్‌లను ఆడాడు. కానీ వికెట్లు తీయడంలో విఫలమయ్యాడు. 2012-2014 మధ్య ఐపీఎల్‌లో 3 సీజన్ల పాటు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆడాడు. కెరీర్‌లో 62 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 191 వికెట్లు పడగొట్డాడు.

ఏడాదిన్నరగా దేశవాళీ క్రికెట్‌కు దూరంగా

ఏడాదిన్నరగా దేశవాళీ క్రికెట్‌కు దూరంగా

ఏడాదిన్నరగా దేశవాళీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. పర్వీందర్ ఆవానా రిటైర్మెంట్ సందర్భంగా ఢిల్లీ తరఫున ఆడిన క్రికెటర్లు ఆశీష్ నెహ్రా, సుమిత్ నర్వాల్, ప్రదీప్ సంగ్వాన్, ఇషాంత్ శర్మ అతడికి సోషల్‌మీడియాలో అభినందనలు తెలిపారు. కాగా, ఇటీవలే టీమిండియా క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Story first published: Wednesday, July 18, 2018, 13:09 [IST]
Other articles published on Jul 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+