For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫరూక్‌ ఇంజినీర్‌ యూటర్న్‌: జోక్‌ చేశా.. అనుష్కశర్మకు క్షమాపణలు!!

Farokh Engineer Apologises After Anushka Sharmas Post

ఢిల్లీ: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భార్య అనుష్క శర్మ, బీసీసీఐ సెలెక్టర్లపై చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ యూటర్న్‌ తీసుకున్నారు. తాను జోక్‌ చేశానని, చిన్న విషయాన్ని పెద్దగా చేసి చూపుతున్నారని ఫరూక్‌ వివరణ ఇచ్చారు. అంతేకాదు అనుష్క శర్మ మంచి అమ్మాయి. ఆమెకు క్షమాపణలు చెబుతున్నా అని అన్నారు. ప్రపంచకప్‌ సమయంలో ఒకతను టీమిండియా బ్లేజర్‌ వేసుకోవడమే దీనికి కారణమని సమర్థించుకున్నారు.

నేను జోక్ చేశా:

నేను జోక్ చేశా:

శుక్రవారం ఫరూక్‌ ఇంజినీర్‌ ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'అనుష్కకు టీ అందించే ఘటన నిజంగానే జరిగింది. అయితే ఈ వివాదంలోకి అనుష్కను అనవసరంగా తీసుకొచ్చారు. నేను ఎదో జోక్ చేశా. చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ రాద్ధాంతం చేస్తున్నారు' అని ఫరూక్‌ సమర్థించుకున్నారు.

అనుష్కకు క్షమాపణలు:

అనుష్కకు క్షమాపణలు:

'ఈ వివాదంలో అనుష్క శర్మను నేను నిందించడం లేదు. అనుష్క చాలా మంచి అమ్మాయి. విరాట్‌ కోహ్లీ అద్భుత కెప్టెన్‌. కోచ్‌ రవిశాస్త్రి బాగా పనిచేస్తున్నాడు. అనుష్క, విరాట్‌ అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఈ విషయంలో ఇబ్బంది పడితే.. ఆమెకు క్షమాపణలు చెబుతున్నా. బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించని సెలక్టర్లపైనే నా కోపమంతా. విరాట్‌, అనుష్కల మీద కాదు' అని వివరణ ఇచ్చారు.

 అనుష్కకు టీ కప్పులు అందించారు

అనుష్కకు టీ కప్పులు అందించారు

'టీమిండియాకు మిక్కీమౌజ్‌ సెలక్షన్‌ కమిటీ దొరికింది. కోహ్లీ జట్టు ఎంపికపై తీవ్ర ప్రభావం చూపుతున్నాడు. అతడు ఏది చెపితే సెలక్టర్లు అదే చేస్తున్నారు. సెలక్టర్లకు ఉన్న అర్హతలేంటి?. అంతా కలిపి కనీసం 12 టెస్టులైనా ఆడలేదు. ప్రపంచకప్‌ కోసం ఇంగ్లాండ్‌కు వచ్చిన సెలక్టర్లలో ఒకరిని నేను గుర్తుపట్టలేకపోయా. టీమిండియా బ్లేజర్ ధరించడంతో ఎవరని ప్రశ్నించా. సెలక్టరని చెప్పాడు. అందరూ అనుష్క శర్మకు టీ కప్పులు అందించారు. వెంగ్‌సర్కార్‌ స్థాయి వ్యక్తులు సెలక్షన్‌ కమిటీలో ఉండాలి' అని ఫరూఖ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నా సొంత ఖర్చులతో వెళ్లా:

నా సొంత ఖర్చులతో వెళ్లా:

ఫరూఖ్‌ వ్యాఖ్యలపై అనుష్క కూడా ఘాటుగానే స్పందించింది. 'విమర్శలు చేసేవారు చాలాసార్లు నా గురించి తప్పుగానే చెబుతున్నారు. ఇదే మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూ ఉంది. అర్థం లేని అబద్ధాలతో కూడిన విమర్శలకు, కామెంట్లకు స్పందించడం ఇష్టం లేకే ఇంతకాలం మౌనంగా ఉన్నా. దీనికి ఈ రోజైనా ముగింపు దొరకాలని స్పందిస్తున్నా. కోహ్లీ ప్రదర్శన బాగా లేనప్పుడు నన్ను టార్గెట్‌ చేశారు. దీనిపై కోహ్లీ వివరణ ఇస్తూనే ఉన్నాడు. కోహ్లీ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు నా సొంత ఖర్చులతోనే వెళుతున్నా. ఎవరైనా అడిగిన క్రమంలో గ్రూప్‌ ఫోటోకి ఫోజిచ్చినా నన్నే విమర్శిస్తున్నారు' అని అనుష్క మండిపడ్డారు.

వివాదాల్లోకి నా పేరు లాగొద్దు:

వివాదాల్లోకి నా పేరు లాగొద్దు:

'ప్రపంచకప్‌ మ్యాచ్‌లో సెలక్టర్లు నాకు టీ అందించారనడం చెడు ఉద్దేశంతో చెప్పిన అబద్ధం. టోర్నీలో నేను ఒక్క మ్యాచే చూశాను. అదీ ఫ్యామిలీ బాక్స్‌లో ఉండి చూశా. సెలెక్టర్ల బాక్స్‌లో నేను కూర్చోలేదు. మీరు సెలెక్షన్‌ కమిటీపైనా, వారి అర్హతలపైనా ఏవైనా విమర్శలు చేయాలనుకుంటే చేసుకోండి. అది మీ ఇష్టం. కానీ.. వివాదాల్లోకి నా పేరును లాగొద్దు. దురుద్దేశంతో కూడిన వ్యవహారాల్లో నా పేరును వాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. నన్ను ఇక్కడితో వదిలేయండి' అని అనుష్క పేర్కొన్నారు.

Story first published: Friday, November 1, 2019, 11:54 [IST]
Other articles published on Nov 1, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+