న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ: రవిశాస్త్రికి ఏమి జరుగుతుందోనని నెటిజన్ల సెటైర్లు!

Fans wonder what will happen to Ravi Shastri after Sourav Ganguly takes over as BCCI president

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడం దాదాపు ఖరారైంది. గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవికి సోమవారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడి హోదాలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.

అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే పోటీ చేస్తుండటంతో అతడి ఎన్నిక లాంఛనమే. అక్టోబర్ 23న గంగూలీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 2020 వరకు దాదా ఈ పదవిలో కొనసాగనున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎన్నిక లాంఛనమైన తరుణంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చను నెటిజన్లు తెరపైకి తీసుకొచ్చారు.

'అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్‌ వేయడం చాలా సంతోషంగా ఉంది''అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్‌ వేయడం చాలా సంతోషంగా ఉంది'

తెరపైకి ఆసక్తికర చర్చ

తెరపైకి ఆసక్తికర చర్చ

ఇంతకీ ఆ ఆసక్తికర చర్చ ఏంటో తెలుసా? బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ అయితే, టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పరిస్థితి ఏంటని! గతంలో రవిశాస్త్రి-సౌరవ్ గంగూలీలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. 2016లో టీమిండియా హెడ్ కోచ్‌ ఎంపిక కోసం బీసీసీఐ సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)ని నియమించింది.

స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన రవిశాస్త్రి

స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన రవిశాస్త్రి

ఈ కమిటీ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఇంటర్యూలు నిర్వహించింది. ఆ సమయంలో రవిశాస్త్రి అందుబాటులో లేకపోవడంతో స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొనడాన్ని లక్ష్మణ్‌, సచిన్‌లు స్వాగతించినప్పటికీ గంగూలీ మాత్రం తప్పుబట్టాడు.

అనిల్ కుంబ్లేని హెడ్ కోచ్‌గా

అనిల్ కుంబ్లేని హెడ్ కోచ్‌గా

అదే సమయంలో మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లేని హెడ్ కోచ్‌గా ఎంపికవడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో తనకు కోచ్‌ పదవి రాకుండా గంగూలీనే అడ్డుకున్నాడని రవిశాస్త్రి బహిరంగంగా ఎన్నో సార్లు విమర్శించాడు. ఆ తర్వాత కోహ్లీతో విభేదాలు తలెత్తడంతో అనిల్ కుంబ్లే తన కోచ్ పదవికి రాజీనామా చేశాడు. అనంతరం సీఏసీ రవిశాస్త్రినే తిరిగి కోచ్‌గా ఎంపిక చేసింది.

రవిశాస్త్రి ఎంపిక పట్ల ఆసక్తి చూపని గంగూలీ

రవిశాస్త్రి ఎంపిక పట్ల ఆసక్తి చూపని గంగూలీ

ఆ సమయంలో కూడా రవిశాస్త్రి ఎంపిక పట్ల గంగూలీ ఆసక్తి చూపలేదు. అయితే దరఖాస్తు చేసుకున్న వారిలో రవిశాస్త్రినే అత్యుత్తమం కావడంతో చేసేదేమి లేక క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ) రవిశాస్త్రినే కోచ్‌గా ఎంపిక చేసింది. అయితే, రవిశాస్త్రి విమర్శలపై గంగూలీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో గంగూలీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రవిశాస్త్రి భవితవ్యం ఏంటని నెటిజన్లు సరదాగా ప్రశ్నిస్తున్నారు.

రెండేళ్ల పాటు హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి

రెండేళ్ల పాటు హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి

రవిశాస్త్రిపై ఫన్నీ మీమ్స్‌ను రూపొందించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నిజానికి సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయినప్పటికీ రవిశాస్త్రి విషయంలో అతడు ఏమీ చేయలేడు. ఎందుకంటే ఈ పదవిలో సెప్టెంబర్ 2020 వరకు సౌరవ్ గంగూలీ కొనసాగనున్నాడు. ఇటీవలే రెండోసారి రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా తిరిగి ఎన్నికైన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు హెడ్ కోచ్‌గా బాధ్యతలు అందించనున్నాడు.

Story first published: Tuesday, October 15, 2019, 12:35 [IST]
Other articles published on Oct 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X