Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sanju Samson: కొత్త సంవత్సరంలో సంజూ రాత మారుతుందా?

 Fans wishe Sanju Samosn to get a long rope in new year

ఈ ఏడాదికి ఒక భారత జట్టు చివరి క్రికెట్ మ్యాచ్ ఆడేసింది. ఇక వచ్చే ఏడాదిని శ్రీలంకతో పరిమిత ఓవర్ల మ్యాచ్‌తో ప్రారంభిస్తుంది. అయితే ఈ టోర్నీలో అయినా కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు అవకాశం దక్కుతుందా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా యువ వికెట్ కీపింగ్ బ్యాటర్ రిషభ్ పంత్ పేలవమైన ప్రదర్శనతో వరుసగా విఫలమవుతూ వస్తున్న సంగతి తెలిసిందే.

ఒకే ఒక్క ఛాన్స్..

ఒకే ఒక్క ఛాన్స్..

పంత్ విఫలమైన ప్రతిసారీ అభిమానులు సంజూ పేరును బయటకు తీయడం పరిపాటిగా మారింది. పంత్‌కు ఇచ్చినన్ని అవకాశాలు సంజూకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అయితే బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం సంజూకు మొండి చెయ్యి చూపుతూనే వస్తున్నారు. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న సంజూ చివరగా భారత్ తరఫున వెస్టిండీస్‌ సిరీస్‌లో టీ20 మ్యాచ్ ఆడాడు. న్యూజిల్యాండ్‌తో వన్డే సిరీస్‌లో ఒక్క అవకాశం ఇచ్చిన టీం మేనేజ్‌మెంట్.. మిగతా రెండు మ్యాచులకు సంజూను పక్కన పెట్టేసింది. ఆ ఒక్క మ్యాచ్‌లో కూడా సంజూ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.

 బంగ్లా సిరీస్‌లో..

బంగ్లా సిరీస్‌లో..

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు గాయంతో పంత్ దూరమవడంతో సంజూకు అవకాశం దొరుకుతుందని అనుకున్నారు. కానీ మేనేజ్‌మెంట్ మాత్రం కేఎల్ రాహుల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే వన్డే, టీ20 సిరీసులు.. ఆ తర్వాత న్యూజిల్యాండ్‌తో జరిగే సిరీసులకు సంజూను ఎంపిక చేయాలని అభిమానులు అంటున్నారు. ఎప్పుడో 2015లో టీమిండియా అరంగేట్రం చేసిన సంజూ కన్నా.. పంత్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ వంటి కొత్త కుర్రాళ్లు ఎక్కువ మ్యాచులు ఆడారని, ఇంత కన్నా ఘోరమైన వివక్ష ఇంక ఏముంటుందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.

కొత్త సంవత్సరంలో అయినా..

కొత్త సంవత్సరంలో అయినా..

కొత్త సంవత్సరంలో భారత జట్టు శ్రీలంకతో ముందుగా మూడు టీ20లు ఆడుతుంది. ఆ తర్వాత మూడు వన్డేలు ఆడుతుంది. ఈ సిరీస్ పూర్తయ్యే సమయానికి పాక్ పర్యటనను న్యూజిల్యాండ్ ముగిస్తుంది. అక్కడి నుంచి భారత్‌కు వచ్చి, ఇక్కడ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీసుల్లో సంజూకు అవకాశం ఇవ్వాలని కొందరు మాజీలు కూడా అంటున్నారు. తాజాగా టీమిండియా మాజీ లెజెండ్ వసీం జాఫర్ కూడా అదే అడిగాడు. 'శ్రీలంక, న్యూజిల్యాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీసుల్లో సంజూకు ఛాన్స్ దొరుకుతుందని అనుకుంటున్నా. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి' అని ట్వీట్ చేశాడు.

Story first published: Monday, December 26, 2022, 22:03 [IST]
Other articles published on Dec 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+