INDvsAUS : టైం అయిపోయింది.. కోహ్లీని కూడా పీకేయండి.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీని కూడా జట్టులో నుంచి పీకేయాలని కొందరు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో విరాట్ కోహ్లీ పెద్దగా రాణించడం లేదు. అతను ఈ సిరీస్‌తో పూర్వపు ఫామ్ అందుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ కోహ్లీ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఢిల్లీ టెస్టులో చేసిన 44 పరుగులే అతని అత్యధిక స్కోరు. అంతకుముందు కూడా కోహ్లీ పెద్దగా రాణించి చాలా కాలమైంది. దీంతో కేఎల్ రాహుల్‌ను తీసేసినట్లే కోహ్లీని కూడా పక్కన పెట్టేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

టెస్టుల్లో ఫామ్ లేదు..
గతేడాది కొంతకాలం పాటు క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్న కోహ్లీ.. వైట్ బాల్ క్రికెట్‌లో ఫామ్ అందుకున్నాడు. మూడు సెంచరీలు కూడా చేశాడు. దీంతో అతను మళ్లీ తన పూర్వవైభవాన్ని అందుకుంటాడని అంతా అనుకున్నారు. అయితే టెస్టుల్లో కోహ్లీ మళ్లీ పూర్వపు ఫామ్ చూపించడం లేదని, ఆ కోరిక కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో తీరిపోతుందని కొందరు మాజీలు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో తొలి టెస్టులో ఫెయిలైన కోహ్లీ.. రెండో టెస్టులో ఫర్వాలేదనిపించాడు. దీంతో మూడో టెస్టులో అతను కచ్చితంగా రాణిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. మూడేళ్ల క్రితం వరకు 50పైగా ఉన్న కోహ్లీ సగటు.. ఇప్పుడు 48కి పడిపోయిందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

రెండు ఇన్నింగ్సుల్లో ఫెయిల్..
ఇండోర్‌లో జరుగుతున్న టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేసిన కోహ్లీ.. రెండో ఇన్నింగ్సులో కేవలం 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. కునేమన్ వేసిన బంతిని బ్యాక్‌ఫుట్‌పై ఆడేందుకు అతను ప్రయత్నించి మిస్సయ్యాడు. అది వెళ్లి అతను బ్యాక్‌ఫుట్‌ను తాకింది. దీంతో అంపైర్ అవుటిచ్చాడు. కోహ్లీ రివ్యూ కోరితే బంతి అతని కాలిని తాకిన ఇంపాక్ట్, వికెట్లను కూల్చుతుందా? అనే రెండు అంశాలూ 'అంపైర్స్ కాల్' అని వచ్చింది.
అయితే అప్పటికే అంపైర్ అవుటిచ్చేయడంతో కోహ్లీ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అతనికి ఇంత దురదృష్టం ఏంటని కొందరు ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. మిగతా బ్యాటర్లు కూడా విఫలం అవడంతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి దిశగా సాగుతోంది.

జట్టులో నుంచి పీకేయండి..
ఇలా కోహ్లీ వరుసగా విఫలమవడం చూసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక కోహ్లీని కూడా జట్టులో నుంచి పీకేసే సమయం వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. నెట్టింట కోహ్లీ ఆటతీరును ఎడగడుతున్నారు. ఇలాంటి సమయంలో కోహ్లీని ఆడించడం వేస్ట్ అని, అతన్ని కూడా రాహుల్‌ను పీకేసినట్లే జట్టులో నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అతని టైం అయిపోయిందని విమర్శలు చేస్తున్నారు. మరి చివరిదైన నాలుగో టెస్టులో అయినా కోహ్లీ రాణించి విమర్శకులకు సరైన సమాధానం ఇస్తాడేమో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications