వుయ్ వాంట్ రెయిన్: టీమిండియా అభిమానుల ఆవేదన!

మాంచెస్టర్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో జరుగుతోన్న తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఎదురీదుతోంది. ఏ మాత్రం గెలుపు అవకాశాలు లేని పరిస్థితిలో పడింది. వరుస వికెట్లను కోల్పోయి కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. సెమీ ఫైనల్‌లో అడుగు పెట్టేంత వరకూ తిరుగులేని విజయాలను నమోదు చేస్తూ వచ్చిన కోహ్లీసేన సెమీ ఫైనల్‌లో తడబడుతోంది.
ఆరు వికెట్లను కోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరింది. ఈ పరిస్థితుల్లో టీమిండియాను ఒడ్డెక్కించేది ఒక్క వర్షమే. భారీ వర్షం కురిసి.. మ్యాచ్ తుడిచి పెట్టుకుని పోతే తప్ప టీమిండియా ఫైనల్‌కు చేరుకోలని స్థితికి చేరింది.ఈ నేపథ్యంలో స్టేడియంలో మ్యాచ్‌ను తిలకిస్తోన్న వారితో పాటు ప్రతి భారతీయ క్రికెట్ ప్రేమికుడూ.. వర్షం పడాలని కోరుకుంటున్నారు. కోటి దేవుళ్లను మొక్కుకొంటున్నారు. వుయ్ వాంట్ రెయిన్ అంటూ ప్రార్థిస్తున్నారు. దీనికి సంబంధించిన మెమెలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా టాప్ ఆర్డర్ పేక మేడను తలపించింది. ఇప్పటిదాకా కొదమ సింహాల్లా ఆడుతూ వచ్చిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలం అయ్యారు. మూడు పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది టీమిండియా. అయిదో స్థానంలో వచ్చిన దినేష్ కార్తిక్ సైతం విఫలం అయ్యాడు. 25 బంతులను ఎదుర్కొన్న దినేష్ కార్తిక్ ఆరు పరుగులు మాత్రమే చేయగలిగాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications