Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

#GoEvenThisSeason: మళ్లీ ఐపీఎల్ టైటిల్‌ను ముంబై జట్టే గెలవాలి!

IPL 2020 : Rohit Sharma Fans Want Mumbai Indians To Defend IPL Title In 2020 ! || Oneindia Telugu
Fans want Mumbai Indians to defend IPL title in 2020 as #GoEvenThisSeason trends on Twitter

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ గత ఏడు సీజన్లలో నాలుగు టైటిళ్లను నెగ్గిందంటే ఆ జట్టు సత్తా ఏంటో చూడండి.

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన గత సీజన్‌ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ పరుగు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ సైతం మూడు టైటిళ్లను సొంతం చేసుకుంది.

ముంబై ఇండియన్స్ విజయాలు సాధించడం కోసం 2018 సీజన్‌లో ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన ఓపెనింగ్ స్థానాన్ని సైతం త్యాగం చేశాడు. ముంబై బ్యాటింగ్ లైనప్‌ను పటిష్టం చేసేందుకు గాను రోహిత్ శర్మ మిడిలార్డర్‌కు మారిన సంగతి తెలిసిందే.

అయితే, ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోండటంతో టైటిల్‌ను తిరిగి నిలబెట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సీజన్ కోసం గత డిసెంబర్‌లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో ముంబై క్రిస్ లిన్ లాంటి స్టార్ ఆటగాళ్లను కోనుగోలు చేసింది.

అలాగే వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెందిన సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను ట్రేడింగ్‌ ద్వారా జట్టులోకి తీసుకుంది. ముంబై ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తోడు బోల్ట్ రావడంతో ముంబై బౌలింగ్ లైనప్‌తో మరింత పటిష్టం కానుంది. ఇక, లసిత్ మలింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.

ఐపీఎల్ 2020 మార్చి 29న జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగే ముంబై ఇండియన్స్ గతంలో 2013, 2015, 2017 మరియు 2019 సంవత్సరాల్లో టైటిల్స్‌ను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో సైతం ముంబై ఇండియన్స్ సత్తా చాటాలని అభిమానులు భావిస్తున్నారు.

ఇందులో భాగంగా మంగళవారం ట్విట్టర్‌లో #GoEvenThisSeason అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్‌కు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇమేజిలను జత చేర్చి ఓ ఆట ఆడుకుంటున్నారు. అవేంటో ఒక్కసారి చూద్దాం....

Story first published: Tuesday, January 28, 2020, 16:47 [IST]
Other articles published on Jan 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+