హైదరాబాదు అభిమానులను నిరాశపరిచిన సచిన్, లక్ష్మణ్

ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సెంచరీల అర్థ సెంచరీ కోసం హైదరాబాది అభిమానులు ఎదురు చూశారు. హైదరాబాదులో సచిన్ సెంచరీ సాధించి తన యాభయ్యవ సెంచరీ సాధిస్తాడని గంపెడాశలు పెట్టుకున్నారు. సెంచరీని పక్కన పెడితే సచిన్ తన ఆటతీరునే ప్రదర్శించలేక పోయాడు. 13 పరుగులకే అవుటయి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాడు. అహ్మదాబాదులోనే తన సెంచరీల అర్ధ సెంచరీ పూర్తి చేస్తాడనుకున్నప్పటికీ అక్కడా నిరాశపరిచాడు. కాగా సచిన్ మాత్రం తనకు యాభయ్యవ సెంచరీకన్నా వేరే ప్రాధాన్యాలున్నాయని అంటున్నాడు.
ఇక అహ్మదాబాదులో జరిగిన మొదటి టెస్టులో లక్ష్మణ్ తో కలిసి వీరోచిత బ్యాటింగ్ చేసిన హర్భజన్ సింగ్ హైదరాబాదులో మళ్లీ విజృంభించి అలరిస్తాడా అని అందరూ ఎదురు చూశారు. అయితే ఆ ఎదురుచూపులను భజ్జీ నిరాశపర్చలేదు. రెండో టెస్టులను 111 పరుగులు చేశాడు. దీంతో వరుసగా రెండు సెంచరీలు చేసిన ఎనిమిదో నంబరు బ్యాట్సుమన్ గా భజ్జీ రికార్డు సాధించాడు. అహ్మదాబాదులో భజ్జీ ఏదో అల్లాటప్పాగా అడలేదని హైదరాబాదులో నిరూపించుకున్నాడు. భజ్జీ ఇప్పుడు ఆల్ రౌండర్ అన్నమాట. రెండో ఇన్నింగ్సులో మెక్ కల్లం భారత బౌలర్లను మూడు చెరువుల నీరు తాగించి డబుల్ సెంచరీ సాధించాడు. అతను 225 పరుగులు చేశాడు. రెండో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications