
36/9కే పరిమితం
మూడో రోజైన శనివారం 9/1తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా 36/9కే పరిమితమైంది. చివరి వికెట్‌గా వచ్చిన మహ్మద్ షమీ (1) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. జట్టులో ఏ బ్యాట్స్‌మెన్ కూడా కనీసం రెండంకెల స్కోరుని కూడా నమోదు చేయలేకపోయారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది ఏడో అత్యల్ప స్కోరు కాగా.. భారత్‌కి ఇదే టెస్టుల్లో తక్కువ స్కోరు కావడం గమనార్హం. 9 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ టాప్ స్కోరర్ అంటే.. భారత ఆటగాళ్లు ఏవిధంగా ఆడారో ఓసారి ఊహించుకోవచ్చు.

4, 9, 2, 0, 4, 0, 8, 4, 0, 4*, 1
రెండో ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా (4), మయాంక్ అగర్వాల్ (9), జస్ప్రీత్ బుమ్రా (2), చతేశ్వర్ పుజారా (0), విరాట్ కోహ్లీ (4), అజింక్య రహానె (0), హనుమ విహారి (8), వృద్ధిమాన్ సాహా (4), ఆర్ అశ్విన్ (0), ఉమేశ్ యాదవ్ (4 నాటౌట్), మహ్మద్ షమీ (1 రిటైర్డ్ హర్ట్)లు పరుగులు చేశారు. మొత్తంగా 21.2 ఓవర్లు మాత్రమే టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయగా.. ఇన్నింగ్స్‌లో కేవలం 4 ఫోర్లు మాత్రమే నమోదయ్యాయి. 4, 9, 2, 0, 4, 0, 8, 4, 0, 4*, 1 ఇవి భారత ఆటగాళ్లు చేసిన పరుగులు. టీమిండియా ఘోర వైఫల్యంపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు కూడా ట్రోల్ చేస్తున్నారు.

సెహ్వాగ్ సెటైర్
భారత ఆటగాళ్ల స్కోర్లపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఫన్నీగా స్పందించాడు. 4, 9, 2, 0, 4, 0, 8, 4, 0, 4*, 1 ఈ నెంబర్ని ఓటీపీగా అభివర్ణించాడు. ఇందులో నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన బ్యాట్స్‌మెన్ చేసిన స్కోరు ఎంత? అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 'రవిశాస్త్రి ఇక కోచ్ పదవి నుంచి దిగిపో', 'సిగ్గు సిగ్గు.. టీమిండియా ఘోర వైఫల్యం నేను చూడలేను', 'ఇవాళ టీమిండియా చెత్త ఆట బాధించింది. నా జీవితంలో 2020 లేకపోయుంటే బాగుండేది', 'ఈ ఏడాది మాకు కలిసిరాలేదు. టీమిండియా వైఫల్యం జీవితాంతం వెంటాడుతుంది. 2020 ముగింపులో ఇదో విషాద వార్త' అంటూ ట్రోల్ చేస్తున్నారు.
|
సిగ్గు పడాల్సిన విషయం
'ఇది నిజంగా సిగ్గు పడాల్సిన విషయం.. 36 పరుగులకే ఇన్నింగ్స్ ముగించి చెత్త రికార్డు నమోదు చేసింది' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'వెంటనే భారత జట్టును స్వదేశానికి రప్పించాలని బీసీసీఐని కోరుతున్నా. బీసీసీఐ వల్ల కాకపోతే భారత ప్రభుత్వం ద్వారా వారిని రప్పించండి' అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. మరికొందరు మొబైల్ నెంబర్ అని సెటైర్లు వేస్తున్నారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది ఏడో అత్యల్ప స్కోరు 36()కాగా.. భారత్‌కి ఇదే టెస్టుల్లో తక్కువ స్కోరు కావడం గమనార్హం.
చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మన్.. ప్రభావం చూపని బౌలర్లు!! డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా విజయం!!