Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni: ధోనీ.. అంతా స్వార్థం..!

CSK VS RCB: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా చెపాక్ట్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచులో ఆర్సీబీపై సీఎస్కే దారుణ ఓటమిని అందుకుంది. వాస్తవానికి గత రికార్డులు ఆధారంగా అందరూ ఈ సారి చెన్నై గెలుస్తుందనుకుంటే, అంచనాలను తారుమారు చేస్తూ 50 పరుగులు తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచులో సీఎస్కే ఓడిపోవడంతో తీవ్ర నిరాశ చెందిన అభిమానులు.. ఇదే సమయంలో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. మహీ అలా వచ్చి వెళ్లిపోవడం వల్ల జట్టుకు ఏం ప్రయోజనం అని సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

ధోనీ అనుకుంటే వాళ్లొచ్చారు..
తాజాగా జరిగిన మ్యాచులో ధోనీ నెం.9వ స్థానంలో వచ్చాడు. అయితే వాస్తవానికి 13వ ఓవర్లో శివం దూబే ఔట్ అయ్యాక.. ధోనీ బ్యాటింగ్ కు వస్తాడని అంతా ఆశించారు. కానీ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వచ్చారు.అనంతరం ధోనీ 16వ ఓవర్లో వచ్చాడు. అయితే నెం.9వ స్థానంలో బ్యాటింగ్ కు దిగినా (పలు సందర్భాలు మినహా) పెద్దగా ఫలితంగా ఉండదు. అప్పటికే మ్యాచ్ చేతులు దాటిపోయే అవకాశం ఉంటుంది. అయితే మహీ రాగానే 16 బంతుల్లోనే రెండు సిక్స్ లు, మూడు ఫోర్ల సాయంతో 30 పరుగులు ధీటుగానే ఆడాడు.

Fans Trolled and Disappointed Dhoni for coming at No 9 in CSK VS RCB IPL 2025

స్వార్థపరుడిలా..
దీంతో ఇదే మహీ ముందుగా వచ్చి ఉంటే మ్యాచ్ ఫలితంగా మరోలా ఉండేదని ఫ్యాన్స్ అంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ అందుకునేదని అభిప్రాయపడుతున్నారు. 43 ఏళ్ల వయసలోనూ మంచి ఫామ్ లో ఉన్న ధోనీ.. ముందుగా వచ్చి మరికొన్ని ఎక్కువ రన్స్ సాధించి ఉంటే మ్యాచ్ అవలీలగా గెలిచేది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అలానే మహీ నెం.9వ స్థానంలో దిగి స్వార్థపరుడిలా వ్యవహరించాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పీఆర్ స్టంటా?...
"నీ నెం.9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. దీనికి బదులు మహీ రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే బాగుండేది", " 197 పరుగుల లక్ష్యంలో 100 పరుగులకే సీఎస్కే కష్టాల్లోకి వెళ్లిపోతే.. ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఉపయోగమేంటి? నెం.9లో వచ్చి రెండు సిక్స్ లు బాదడటం పీఆర్ స్టంటా? ఫ్యాన్స్ కోసం కేవలం కొన్ని సిక్స్ లు బాదితే, అది విజయాన్ని అందించదు. లేదంటే మహీ టాప్ ఆర్డర్ లో కీలకంగా ఆడటంలో ఆత్మావిశ్వాసం కోల్పోయాడా? అతడిని ఈ విషయం గురించి ప్రశ్నించాల్సిందే" అని తెగ కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Saturday, March 29, 2025, 7:45 [IST]
Other articles published on Mar 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+