న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ : ఇదేం బౌలింగ్‌రా.. నువ్వే వాళ్లను గెలిపిస్తున్నావ్.. టీమిండియా పేసర్‌పై ట్రోల్స్!

Fans troll young pacer Arshdeep Singh for his miserable outing

క్రికెట్‌లో బ్యాటర్లు ఎంత ముఖ్యమో.. బౌలర్లు కూడా ఒక జట్టుకు అంతే ముఖ్యం. మొదట బ్యాటింగ్ చేసిన ఏ జట్టయినా మ్యాచ్ గెలవడం, ఓడటం బౌలర్లపైనే ఆధారపడి ఉంటుంది. వాళ్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీసుకుంటే మ్యాచ్ గెలుస్తుందా జట్టు. లేదంటే ఓటమి తప్పదు. అందుకే ఎలాంటి పరిస్థితిలో అయినా చక్కగా బౌలింగ్ చేసే వారి కోసం అన్ని జట్లూ వెతుకుతుంటాయి. అలా టీ20 ఫార్మాట్ కోసం టీమిండియా సెలెక్ట్ చేసిన బౌలర్ అర్షదీప్ సింగ్.

నమ్మకం లేదు దొరా..

కానీ అతను తన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేక పోతున్నాడు. ఏదో ఒక మ్యాచ్‌లో విఫలం అవడం కామన్. దాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. ఒక్కోసారి మనం ఎంత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా.. ఎదుటి బ్యాటర్ సత్తా ఉంటే మనల్ని టార్గెట్ చేసి భారీ షాట్లు ఆడేస్తారు.

కానీ అలాంటి సమయంలో కూడా సదరు బౌలర్ పొరపాట్లు చేయకుండా ఉంటే ఎవరూ ఏమీ అనరు. అర్షదీప్ మాత్రం అలాక్కాదు. అయితే ఒక మ్యాచ్‌లో సూపర్‌గా బౌలింగ్ చేస్తాడు. లేదంటే భారీగా పరుగులు సమర్పించుకుంటాడు. దానికి తోడు కీలకమైన సమయాల్లో నోబాల్స్ వేసి మరీ ప్రత్యర్థికి లబ్ది చేకూరుస్తున్నాడు.

చివరి ఓవర్లో భారీగా పరుగులు..

న్యూజిల్యాండ్‌తో జరిగిన తొలి టీ20లో కూడా అర్షదీప్ అదే చేశాడు. 19 ఓవర్లకు కివీస్ 149 పరుగులతో ఉన్నప్పుడు చివరి ఓవర్ వేయడానికి అతను వచ్చాడు. ఇలాగైతే ఆ జట్టును 160 పరుగలకు కట్టడి చేయొచ్చని అంతా అనుకున్నారు.

కానీ తొలి బంతికే నోబాల్ వేసి మరీ సిక్సర్ ఇచ్చిన అర్షదీప్.. ఆ ఓవర్లో ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కివీస్ జట్టు 176 పరుగులు చేసి భారత్ ముందు కఠినమైన టార్గెట్ ఉంచింది. బ్యాటర్లు విఫలం అవడంతో ఈ లక్ష్యాన్ని భారత్ ఛేదించలేకపోయింది.

పేలుతున్న మీమ్స్..

దీన్నే ఎత్తి చూపుతున్న అభిమానులు అర్షదీప్ సింగ్‌ను నెట్టింట ఏకిపారేస్తున్నారు. 'అసలు నువ్వు ఏం చేస్తున్నావురా నాయనా?' అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'కేవలం 4 ఓవర్లలో 51 పరుగులు ఇవ్వడం అంటే మాటలు కాదు. ప్రత్యర్థిని గెలిపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. సూపర్ హిట్ మూవీ కేజీయఫ్2లోని డైలాగ్‌తో కూడా అర్షదీప్‌పై మీమ్స్ చేస్తున్నారు. 'నోబాల్.. నోబాల్.. ఐ ఎవాయిడ్ నోబాల్. బట్ నోబాల్ లవ్స్ మీ. ఐ కాన్ట్ ఎవాయిడ్' అంటూ జోకులు పేలుస్తున్నారు.

Story first published: Saturday, January 28, 2023, 12:08 [IST]
Other articles published on Jan 28, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X