INDvsBAN: క్యాచ్ డ్రాప్ అవ్వకపోతే.. కోహ్లీ స్కోర్ చెయ్యలేడు.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిరాశ పరిచాడు. కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్ ఇద్దరూ త్వరగా అవుటవడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. కానీ ఈ అవకాశాన్ని ఏమాత్రం ఉపయోగించుకోలేదు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. తైజుల్ ఇస్లాం వేసిన బంతిని బ్యాక్ ఫుట్ పై ఆడేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. అయితే బంతి టర్న్ అవడంతో అతని అంచనా తప్పింది. దీంతో ఎల్బీగా అవుట్ అయ్యాడు. అవతలి ఎండ్ లో ఉన్న పుజారాను సంప్రదించి ఒక రివ్యూ కూడా తీసుకున్నాడు కోహ్లీ. కానీ అంపైర్ నిర్ణయం మారలేదు.
ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్ లో మంచి ఫామ్ చూపించిన కోహ్లీ.. అదే ఫామ్ ను టెస్టులో కొనసాగించలేక పోయాడు. కేవలం ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని వెనుదిరిగాడు. దీంతో అభిమానులు కోహ్లీపై సెటైర్ లు వేస్తున్నారు. డెడ్ రబ్బర్ మ్యాచులు, డ్రాప్ క్యాచులు లేకపోతే కోహ్లీ పరుగులు చెయ్యలేడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత కోహ్లీ తన 71వ అంతర్జాతీయ సెంచరీ చేసింది ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన డెడ్ రబ్బర్ మ్యాచులో అన్న సంగతి తెలిసిందే. దానికితోడు ఆ మ్యాచులో కోహ్లీ ఇచ్చిన సులభమైన క్యాచును ఆఫ్ఘన్ ఫీల్దర్లు జారవిడిచారు. తాజాగా బంగ్లాతో జరిగిన మూడో వన్డేలో కూడా కోహ్లీ శతకం చేశాడు. కానీ ఆ మ్యాచులో కూడా కోహ్లీ క్యాచును బంగ్లా ఫీల్డర్లు వదిలేశారు. అలాగే అంతకుముందు రెండు వన్డేల్లో గెలిచిన బంగ్లా అప్పటికే సీరీస్ తమ ఖాతాలో వేసుకుంది.
బంగ్లాపై ఈ రెండు టెస్టులు గెలవడం భారత జట్టుకు చాలా కీలకం. ఈ మ్యాచులు ఓడితే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ లో భారత్ చాలా వెనుకపడుతుంది. ఈ టోర్నీ ఫైనల్ చేరడం అసాధ్యంగా మారుతుంది. ఇలాంటి మ్యాచ్ లో కోహ్లీ విఫలం అవడంపై ఫ్యాన్స్ చాలా ఆగ్రహం చూపిస్తున్నారు. మరి రెండో ఇన్నింగ్సులో అయినా కోహ్లీ రాణిస్తాడేమో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications