Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsNZ : చూస్తున్నావా సాయిబాబా?.. టీమిండియాపై పేలుతున్న మీమ్స్!

Fans troll team india for ignoring Prithvi Shaw in first INDvsNZ T20I

రాంచీ వేదికగా జరిగి తొలి టీ20కి ముందు టీమిండియా ఓపెనర్లుగా ఎవరు వస్తారు? అనే ప్రశ్న అభిమానులకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తారని, వేరే వాళ్లకు అప్పుడే ఛాన్స్ దక్కదనం కెప్టెన్ పాండ్యా తేల్చిచెప్పేశాడు. అయితే వాళ్లిద్దరూ తొలి టీ20లో దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా ఇషాన్ టీ20 ఫార్మాట్లో ఫెయిలవడం కొనసాగుతూనే ఉంది. కానీ అతనికి అవకాశాలు దక్కుతూనే ఉన్నాయి.

 శ్రీలంక సిరీస్‌లోనూ ఇంతే..

శ్రీలంక సిరీస్‌లోనూ ఇంతే..

ఇక గిల్ అయితే వన్డేల్లో అద్భుతంగా ఆడుతున్న మాట వాస్తవమే. కానీ అతను టీ20 ప్లేయర్ కాదని చాలా మంది అంటున్నారు. ఈ ఫార్మాట్లో ధనా ధన్ ఓపెనింగ్ ఇవ్వడంలో గిల్ ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. అంతకుముందు శ్రీలంకపై కూడా గిల్, ఇషాన్ జోడీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ సిరీస్ తొలి మ్యాచ్‌లో ఇషాన్ 30+ స్కోరు చేశాడు. ఆ తర్వాత రెండు మ్యాచుల్లో 5 పరుగులు కూడా చేయలేదు. ఇక గిల్ అయితే తొలి రెండు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరు చేశాడు. మూడో వన్డేలో నిదానంగా ఆడుతూ 46 పరుగులు చేశాడు.

ఓపెనర్ల వైఫల్యంతో ఒత్తిడి

ఓపెనర్ల వైఫల్యంతో ఒత్తిడి

ఇలాంటి సమయంలో పృథ్వీ షాను కివీస్ సిరీస్‌కు సెలెక్టర్లు ఎంపిక చేశారు. సరైన ఓపెనర్లు లేరని బాధ పడుతున్న టీమిండియాకు ఇది సరైన ఆప్షన్ అని అంతా అనుకున్నారు. కానీ పాండ్యా, టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం పృథ్వీ షాను పక్కన పెట్టేశారు.

ఇక కివీస్‌తో టీ20లో గిల్, కిషన్ ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. కిషన్ చాలా త్వరగా అవుటవడంతో కొత్త ఆటగాడు రాహుల్ త్రిపాఠీపై తీవ్రమైన ఒత్తిడి పడింది. దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయిన త్రిపాఠీ కూడా అవుటైపోయాడు.

సాయిబాబా పోస్టు..

సాయిబాబా పోస్టు..

దీన్ని సోషల్ మీడియాలో ఎత్తి చూపుతున్న అభిమానులు.. పృథ్వీ షాను ఆడించకపోవడంపై టీమిండియాను తిట్టిపోస్తున్నారు. 'చూస్తున్నావా సాయిబాబా?' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

గతంలో తను అద్భుతంగా రాణించినా టీమిండియా పిలుపు రాకపోవడంతో పృథ్వీ షా తన సోషల్ మీడియాలో ఇలాంటి మెసేజ్ పెట్టిన సంగతి తెలిసిందే. అది అప్పట్లో చాలా వైరల్ అయింది. దాన్ని గుర్తు చేస్తూనే ఇప్పుడు మళ్లీ నెటిజన్లు దాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మిగతా మ్యాచుల్లో అయినా పృథ్వీ షాను ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు.

Story first published: Saturday, January 28, 2023, 10:08 [IST]
Other articles published on Jan 28, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+