Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: సంజూ శాంసన్‌లా చేస్తున్నారుగా.. కుల్దీప్‌ను పక్కనపెట్టడంపై పేలుతున్న మీమ్స్

 Fans troll team india for benching Kuldeep Yadav

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత జట్టును బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో రెండు విభాగాల్లో ఆదుకున్న ఆటగాడు కుల్దీప్ యాదవ్. అద్భుతమైన పట్టుదలతో తొలి ఇన్నింగ్స్‌లో 40 పరుగులు చేశాడు. అలాగే ఐదు వికెట్లు కూడా తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో మరో మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కూడా దక్కింది. అలాంటి ఆటగాడిని సడెన్‌గా రెండో టెస్టులో పక్కన పెట్టేసినట్లు కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రకటించాడు. దీంతో క్రీడాలోకం ఖంగుతింది.

టాలెంట్ ఉన్నా భారత జట్టులో చోటు దక్కని ఆటగాళ్ల పేర్లు చెప్తే అందరూ ఫస్ట్ చెప్పే పేరు సంజూ శాంసన్. అతన్ని కూడా పెద్ద కారణాలు లేకుండానే బెంచ్‌కి పరిమితం చేయడం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు అలవాటు. ఇప్పుడు తొలి టెస్టులో అదరగొట్టిన కుల్దీప్‌ను పక్కన పెట్టడాన్ని కూడా దీనితోనే పోలుస్తున్నారు ఫ్యాన్స్. ఈరోజు కుల్దీప్ పరిస్థితి కూడా సంజూ శాంసన్‌లా మారిందని కామెంట్లు చేస్తున్నారు. తొలి టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడమే కుల్దీప్ చేసిన నేరమా? అని ప్రశ్నిస్తున్నారు.

 Fans troll team india for benching Kuldeep Yadav

కుల్దీప్‌ను పక్కన పెట్టినట్లు టాస్ సమయంలో ప్రకటించిన కేఎల్ రాహుల్.. అతని స్థానంలో జయదేవ్ ఉనద్కత్‌ను ఆడిస్తున్నట్లు చెప్పాడు. పన్నెండేళ్ల తర్వాత ఉనద్కత్‌కు జట్టులో చోటు దక్కినందుకు అభిమానులు సంతోషించినా, అతని కోసం కుల్దీప్‌ను పక్కన పెట్టడం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అతని స్థానంలో వచ్చిన ఉనద్కత్‌ కూడా తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. రెండో టెస్టులో భారత్‌కు తొలి వికెట్ అందించాడు. అతనితోపాటు చాలా కాలం తర్వాత అశ్విన్ కూడా చకచకా వికెట్లు తీశాడు. దీంతో బంగ్లాదేశ్ జట్టు టీ సమయానికి 5 వికెట్ల నష్టానికి 184 పరుగులతో నిలిచింది. అశ్విన్, ఉనద్కత్ చెరో వికెట్ తీసుకోగా.. ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Story first published: Thursday, December 22, 2022, 14:00 [IST]
Other articles published on Dec 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+