Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: ఇదేనా మీ దూకుడు?.. టీమిండియాపై ఫ్యాన్స్ ట్రోలింగ్

Fans troll team india after top order fails again

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడిన టీమిండియా తాత్కాలిక సారధి కేఎల్ రాహుల్.. తమ నుంచి దూకుడైన ఆటతీరు చూస్తారని హామీ ఇచ్చాడు. ఇక మ్యాచ్ ఆరంభంలో అతనికి అంతా కలిసొచ్చింది. టాస్ కూడా గెలిచాడు. ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో దూకుడుగా ఆడుతూ టీమిండియా భారీ స్కోరు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ మ్యాచ్ మొదలైన తర్వాత సీన్ రివర్స్ అయింది.

మ్యాచ్ ఆరంభమైన కాసేపటికే శుభ్‌మన్ గిల్ (40 బంతుల్లో 20) అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. మంచి ఫామ్‌లో ఉన్న అతను ఇలా తనకు వచ్చిన అవకాశాన్ని మరోసారి వేస్ట్ చేసుకోవడం చూసి అభిమానులు షాక్ తిన్నారు. కానీ ఇంకా బ్యాటింగ్ లైనప్ ఉంది కదా అని అనుకున్నారు. వారందరికిీ కాసేపటికే కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా షాకిచ్చాడు. తనదైన స్టైల్‌లో వికెట్ పారేసుకున్నాడు. బౌలర్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడతను. దీంతో ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. అప్పటికి రాహుల్ స్కోరు 54 బంతుల్లో 22 పరుగులు మాత్రమే.

ఇద్దరు కీలక బ్యాటర్లు అవుటవడంతో విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. అతను కూడా మంచి ఫామ్‌లో ఉండటంతో కోహ్లీపై కూడా అభిమానులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. కానీ తైజుల్ ఇస్లామ్ వేసిన బంతి షార్ప్ టర్న్ తీసుకోవడంతో కోహ్లీ తడబడ్డాడు. ఈ క్రమంలో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన అతను కూడా అవుటవడంతో టీమిండియా ఫ్యాన్స్ తమ ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు. 'ఇదేనా మీ దూకుడైన ఆట?' అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. దూకుడు తర్వాత ముందు వికెట్లు కాపాడుకోండి అంటూ మరికొందరు చురకలు వేస్తున్నారు.

Story first published: Wednesday, December 14, 2022, 19:05 [IST]
Other articles published on Dec 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+