INDvsAUS : ఎవరైనా చెప్పండ్రా వాడికి.. స్టీవ్ స్మిత్ డకౌట్‌పై పేలుతున్న మీమ్స్!

ఢిల్లీ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. తను వేసిన తొలి ఓవర్ నుంచే బంతిని తనకు నచ్చినట్లు తిప్పుతూ ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. అయితే అతనికి వికెట్ ఇవ్వకుండా ఆసీస్ బ్యాటర్లు చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. షమీ బౌలింగ్‌లో వార్నర్ అవుటైన తర్వాత లబుషేన్, ఖవాజా ఇద్దరూ చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా ఖవాజా అయితే భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. భారీ షాట్లు ఆడుతూ ఆకట్టుకున్నాడు.
అశ్విన్ బుట్టలో లబుషేన్..
ఈ క్రమంలోనే లబుషేన్ కూడా అశ్విన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. మంచి ఇంటెంట్‌తో బ్యాటింగ్ చేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో చక్కని బౌండరీలు కూడా బాదాడు. అతను వ్యక్తిగత స్కోరు 18 వద్ద ఉండగా.. అశ్విన్ వేసిన బంతిని డిఫెండ్ చేసుకోబోయాడు. ఈ క్రమంలో బంతి అతని బ్యాటు పక్క నుంచి వెళ్లి ప్యాడ్లను తాకింది. భారత జట్టు అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ ఇవ్వలేదు. అశ్విన్ చాలా నమ్మకంగా చెప్పడంతో రోహిత్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లేలో బంతి బ్యాటును తాకలేదని తేలడంతో లబుషేన్ పెవిలియన్ చేరాడు.

స్మిత్ తొలి డకౌట్..
అతను అవుటవగానే స్టీవ్ స్మిత్ క్రీజులోకి వచ్చాడు. తను ఎదుర్కొన్న తొలి బంతికి పరుగులేవీ చేయని అతను.. రెండో బంతికే పెవిలియన్ చేరాడు. అశ్విన్ వేసిన బంతి స్పిన్ అయి తన వైపు వస్తుందని స్మిత్ భావించాడు. కానీ అది స్పిన్ అవకుండా బ్యాటుకు దూరంగానే కీపర్ వైపు వెళ్లింది. ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ భరత్ చక్కగా క్యాచ్ పట్టాడు. కిందకు వచ్చిన బంతిని రెండు చేతులతో పట్టేశాడు. బ్యాటుకు బంతి తగిలినట్లు తెలిసిన స్మిత్.. అంపైర్ నిర్ణయం వరకు కూడా ఆగలేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయి చిరాకుగా మైదానం వీడాడు. భారత గడ్డపై అతను ఇలా డకౌట్ అవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
జోకులు పేలుస్తున్న ఫ్యాన్స్..
స్మిత్ ఇలా అవుటవడాన్ని చూసి క్రీడాభిమానులు తెగ జోకులు పేలుస్తున్నారు. మ్యాచ్‌కు ముందు పిచ్‌ను పరిశీలిస్తున్న స్మిత్ ఫొటోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫొటోల్లో పిచ్‌ను స్మిత్ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ కనిపించాడు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్న అభిమానులు.. పిచ్‌ను పరిశీలించినంత సేపు కూడా బ్యాటింగ్ చేయలేదుగా అంటూ జోకులు వేస్తున్నారు. 'పిచ్‌కు చిల్లులు పడేలా చూస్తే ప్రయోజనం ఉండదు. ప్రాక్టీస్ చేయాలని ఎవర్నా చెప్పండ్రా వాడికి' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications