Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsBAN: ఇంకెన్ని ఛాన్సులు వేస్ట్ చేస్తావ్?.. టీమిండియా బ్యాటర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం

 Fans troll Shubman Gill for getting out cheaply once again

టీమిండియాలో చోటు దక్కాలంటే రాసి పెట్టి ఉండాలి. అద్భుతమైన టెక్నిక్, ఎలాంటి పరిస్థితిలో అయినా ఆడే సత్తా ఉన్న ఆటగాళ్లకు కూడా టీమిండియాలో చోటు దక్కక బాధ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువ ఆటగాళ్లు తమకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. మంచి ఇన్నింగ్స్‌లు ఆడి జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

ఫామ్‌లో ఉన్నా కూడా..

ఫామ్‌లో ఉన్నా కూడా..

కానీ టీమిండియా యువ కెరటం శుభ్‌మన్ గిల్ మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. టెస్టుల్లో ఎన్నో అవకాశాలు పొందిన అతను.. ఓపెనర్‌గా వచ్చి కూడా ఒక్కటంటే ఒక్క టెస్టు శతకం కూడా చేయలేకపోయాడు. గతేడాది ఐపీఎల్ వరకు అతన్ని పరిమిత ఓవర్ల క్రికెట్‌ కోసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. కానీ ఐపీఎల్‌లో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లతో వన్డే జట్టులోకి కూడా వచ్చాడు. ఆ తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్ పర్యటన్లలో ఫర్వాలేదనిపించాడు. తొలి అంతర్జాతీయ శతకం కూడా నమోదు చేశాడు.

తొలి టెస్టులో ఫెయిల్..

తొలి టెస్టులో ఫెయిల్..

గిల్ మంచి ఫామ్‌లో ఉండటంతో బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టులో కూడా అతన్ని తీసుకున్నారు. కానీ ఈ అవకాశాన్ని అతను ఉపయోగించుకోలేదు. అనవసర షాట్‌కు ప్రయత్నించి స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. తైజుల్ ఇస్లామ్ వేసిన బంతిని ప్యాడిల్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతిని సరిగా అంచనా వేయలేకపోవడంతో అది ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. స్లిప్స్‌లో ఉన్న ఫీల్డర్ దాన్ని చక్కగా అందుకోవడంతో గిల్ ఇన్నింగ్స్ ముగిసింది. అతను 40 బంతుల్లో 20 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

ఫ్యాన్స్ ఆగ్రహం..

ఫ్యాన్స్ ఆగ్రహం..

గిల్ ఇలా తనకు వచ్చిన అవకాశాలను వృధా చేసుకోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని చాన్సులు ఎవడైనా వేస్ట్ చేసుకుంటాడా? అని అడుగుతున్నారు. గబ్బాలో ఆస్ట్రేలియాపై చేసిన 94 పరుగుల ఇన్నింగ్స్ తప్ప మిగతా అన్ని మ్యాచుల్లోనూ ఇలా చెత్త షాట్లతో అనవసరంగానే గిల్ అవుట్ అవుతున్నాడని మండి పడుతున్నారు. అతని బదులు అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడించి ఉండాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. మరి గిల్ రెండో ఇన్నింగ్స్‌లో అయినా తనపై వస్తున్న విమర్శలకు బ్యాటుతో బదులిస్తాడేమో చూడాలి.

Story first published: Wednesday, December 14, 2022, 11:10 [IST]
Other articles published on Dec 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+