INDvsBAN: ధవన్ మళ్లీ ఫెయిల్.. ఇక సెలవు అంటూ ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

'అసలే తొలి రెండు వన్డేల్లో ఓటమి. అది కూడా పసి కూన జట్టు చేతిలో. సిరీస్ ఎలాగూ పోయింది.. చివరి మ్యాచ్‌లో అయినా జట్టును గెలిపించి పరువు నిలపాలని లేదు' అంటూ టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్‌పై ఫ్యాన్స్ మండి పడుతున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో కూడా ఈ ఎడం చేతి వాటం ఓపెనర్ నిరాశ రిచాడు. అవతలి ఎండ్‌లో యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ నిర్మిస్తుంటే తను మాత్రం వికెట్ పారేసుకున్నాడు. వరుసగా మూడో సారి సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు.
ఇలా బంగ్లాదేశ్‌పై ప్లాప్ షో చూపించిన ధవన్‌పై టీమిండియా ఫ్యాన్స్ మండి పడుతున్నారు. 'టీమిండియాకు నువ్వు ఇప్పటి వరకు ఇచ్చిన జ్ఞాపకాలు చాలు గబ్బర్.. ఇక వీడ్కోలు' అంటూ ధవన్ రిటైర్ అయిపోయినట్లు మీమ్స్ చేస్తున్నారు. అంతకుముందు కివీస్ పర్యటనలో కూడా ధవన్ పెద్దగా రాణించలేదు. కెప్టెన్సీ కూడా సరిగా చేయలేక సిరీస్ కోల్పోయాడు. ఆ సిరీస్‌లో చివరి రెండు మ్యాచులు వర్షం వల్ల ఫలితం తేలలేదు. అయితే దాని వల్ల భారత్ కనీసం ఓటమి తప్పించుకుందని మాజీలు కూడా ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ధవన్ మరోసారి దారుణంగా విఫలమైనా ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతను కేవలం 131 బంతుల్లోనే 210 పరుగులు చేశాడు. ఇషాన్‌కు తోడు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా మూడేళ్ల తర్వాత వన్డే శతకం సాధించాడు. అతను 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు 409 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో ఆ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. చివరకు 182 పరుగులకే ఆలౌట్ అయిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications