Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : ఇదేంట్రా రోహిత్?.. అదేమైనా శాపమా ఏంటి?.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

 Fans troll Rohit Sharma for getting out at the same score

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతను.. మూడో టెస్టులో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 12 పరుగుల వద్ద ఆసీస్ కొత్త కుర్రాడు కునేమన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈసారి ఆసీస్ వెటరన్ స్పిన్నర్ లియాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దనే అవుటయ్యాడు. రెండు ఇన్నింగ్సుల్లో అతను ఒకే స్కోరు వద్ద అవుటవడంపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.

ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రాహుల్ స్థానంలో ఆడిన శుభ్‌మన్ గిల్ కూడా ఫెయిలయ్యాడు. తొలి ఇన్నింగ్స‌లో 21 పరుగులు చేసిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 5 పరుగులకే అవుటయ్యాడు. గిల్‌ను అవుట్ చేసిన నాథన్ లియాన్.. ఆ తర్వాత కాసేపటికే రోహిత్‌ను కూడా బుట్టలో వేసుకున్నాడు. లియాన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ విఫలమయ్యాడు. దీంతో అది అతని ప్యాడ్లను తాకింది. దీంతో రోహిత్ ఎల్బీగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఇది చూసిన నెటిజన్లు రోహిత్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఈ టెస్టులో రోహిత్ చేసే పనులన్నీ ఇలాగే ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.

అంతకుముందు అనవసరంగా డీఆర్ఎస్‌ను వేస్ట్ చేయడం, రెండో రోజు ఆట మొదలైన తర్వాత అశ్విన్‌ను బరిలో దించడానికి ఆలస్యం చేయడం, ఇలా వరుసగా రోహిత్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడని మండిపడుతున్నారు. వాటి మీద మరో బంపరాఫర్ కింద ఒకే స్కోరు వద్ద రెండు ఇన్నింగ్సుల్లో అవుటయ్యాడని విమర్శిస్తున్నారు. ఇదేమన్నా రోహిత్‌కు శాపంగా మారిందా? అని టెన్షన్ పడుతున్నారు కొందరు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ, శ్రేయాస్ కూడా పెద్దగా రాణించలేదు. ఈ లెక్కన మూడో టెస్టులో ఆసీస్ గెలిచినా గెలిచేలా ఉందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Story first published: Thursday, March 2, 2023, 15:16 [IST]
Other articles published on Mar 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+