Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCBvsDC : చిత్తుగా ఓడిన ఆర్సీబీ అమ్మాయిలు.. అబ్బాయిల అడుగు జాడల్లోనే అంటూ ట్రోలింగ్!

Fans troll RCB women team for the loss against DC

మహిళల ప్రీమియర్ లీగ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘోరమైన ఓటమితో ప్రారంభించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 60 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ అద్భుతంగా ఆడింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (84), మెగ్ లానింగ్ (72) ఆ జట్టుకు సూపర్ ఓపెనింగ్ అందించారు. వీళ్లిద్దరే తొలి వికెట్‌కు 162 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

రాణించిన ఢిల్లీ..

ఢిల్లీ ఓపెనర్లిద్దరినీ ఆర్సీబీ స్పిన్నర్ హెదర్ నైట్ ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చింది. కానీ అప్పటికే ఢిల్లీ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఆ తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగెజ్ (22 నాటౌట్), మారిజానే కాప్ (39 నాటౌట్) కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. ఇన్నింగ్స్ ఆసాంతం ఎటాకింగ్ గేమ్ ఆడిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంత పెద్ద టార్గెట్‌తో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడబడుతుందని అంతా అనుకున్నారు.

తేలిపోయిన బ్యాటింగ్..

కానీ ఆర్సీబీ ఓపెనర్లు స్మృతి మంధాన (35), సోఫీ డివైన్ (14) చూడచక్కని షాట్లతో అలరించారు. ఇలాంటి సమయంలో అద్భుతమైన క్యాచ్‌తో డివైన్‌ను షెఫాలీ వర్మ పెవిలియన్ చేర్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఎలీస్ పెర్రీ (31) కూడా రాణించింది. కానీ మిగతా బ్యాటర్లలో మేగన్ షూట్ (30 నాటౌట్), హెదర్ నైట్ (34) తప్ప ఇంకెవరూ ఆడలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయిన కేవలం 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ జట్టులో ఒక్క పెర్రీ తప్ప మిగతా బ్యాటర్లు అందరూ భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి, బంతిని గాల్లోకి లేపి అవుటైన వారే కావడం గమనార్హం.

ఇంకో నెల ఎక్స్‌ట్రా బాధ..

ఈ మ్యాచ్ ఆసాంతం చూసిన అభిమానులు ఆర్సీబీపై మరోసారి ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. పురుషుల ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టు ఇప్పటి వరకు ఒక్క ట్రోఫీ కూడా నెగ్గలేదు. తొలి ఐపీఎల్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాగే భారీగా పరుగులు సమర్పించుకొని, చివరకు 140 పరుగుల తేడాతో ఓడింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఆర్సీబీ అంటే ఇతే అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'ఐపీఎల్‌లో కోహ్లీ లెగసీని మంధాన కూడా కంటిన్యూ చేస్తోంది' అంటూ జోకులు పేలుస్తున్నారు. డబ్ల్యూపీఎల్‌తో ఆర్సీబీ ఫ్యాన్స్ ఏడవడానికి మరో నెల పెరిగిందంటూ ఎగతాళి చేస్తున్నారు.

Story first published: Sunday, March 5, 2023, 20:48 [IST]
Other articles published on Mar 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+