Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2023 : చిత్తుగా ఓడుతున్న టీం.. ఆర్సీబీ పేరే దరిద్రం అంటున్న ఫ్యాన్స్!

Fans troll RCB for second consecutive loss in WPL 2023

మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు వరుసగా రెండో మ్యాచులోనూ ఓటమిపాలైంది. టీమిండియా స్టార్ స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆడుతున్న ఈ జట్టులో పలువురు స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. టోర్నీ ఆరంభానికి ముందు ట్రోఫీ నెగ్గే ఛాన్స్ ఈ జట్టుకే ఎక్కువ ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. కానీ మ్యాచులు మొదలయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

ప్రభావం చూపని స్టార్ ప్లేయర్లు..

ప్రభావం చూపని స్టార్ ప్లేయర్లు..

మంధానతోపాటు ఎలీస్ పెర్రీ, రిచా ఘోష్, హెదర్ నైట్ వంటి బిగ్ హిట్టర్లు ఉన్నా కూడా భారీ స్కోర్లు చేయడంలో ఈ టీం విఫలం అవుతోంది. తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడిన ఆర్సీబీ.. రెండో మ్యాచ్‌లో ముంబై చేతిలో కూడా అలాగే ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఆర్సీబీకి ఎంతో కీలకమైన స్మృతి మంధాన, రిచా ఘోష్, హెదర్ నైట్ ముగ్గురూ కూడా భారీ స్కోర్లు చేయలేకపోతున్నారు.

ముంబై ఆల్‌రౌంర్ హేలీ మాథ్యూస్ ఈ ముగ్గుర్నీ అవుట్ చేసి ఆర్సీబీ నడ్డి విరిచింది. దీంతో ఆ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. చివర్లో శ్రేయాంక, మేగన్ షూట్ కొంత పోరాడటంతో 18.4 ఓవర్లలో 155 పరుగులు చేసిందా జట్టు.

టాప్ లేపిన ముంబై..

టాప్ లేపిన ముంబై..

ఓ మోస్తరు లక్ష్యంతో బరిలో దిగిన ముంబైకి మంచి ఆరంభం లభించింది. యాస్తికా భాటియా (23) ఫర్వాలేదనిపించింది. అయితే మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్ (38 బంతుల్లో 77 నాటౌట్) అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడింది.

యాస్తికా అవుటైన తర్వాత వచ్చిన నాట్ సివర్ బ్రంట్ (29 బంతుల్లో 55 నాటౌట్) కూడా ఆకాశమే హద్దుగా చెలరేగింది. దీంతో ముంబై జట్టు సులభంగా విజయతీరాలకు చేరింది. కేవలం 14.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ నష్టపోయి టార్గెట్ ఛేజ్ చేసేసింది.

ఆర్సీబీ పేరే దరిద్రం అంటూ ట్రోల్స్..

ఆర్సీబీ పేరే దరిద్రం అంటూ ట్రోల్స్..

ఇది చూసిన ఫ్యాన్స్ ఆర్సీబీని తెగ ట్రోల్ చేస్తున్నారు. 'పేపర్ మీద ఎంత బలంగా కనిపించినా కూడా.. ఆర్సీబీ పేరే దరిద్రం.. ఆ జట్టులో చేరితే ఇంతే' అంటూ స్టార్ ప్లేయర్లను తిట్టిపోస్తున్నారు. కొందరేమో ఆర్సీబీ పేరులోనే దరిద్రం ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎలీస్ పెర్రీ, మంధాన, హెదర్ నైట్ తదితరులు వరుసగా విఫలం అవడానికి ఆ జట్టు దరిద్రమే కారణం అంటూ విమర్శలు చేస్తున్నారు.

ఏదేమైనా ఐపీఎల్‌లోనే కాదు, డబ్ల్యూపీఎల్‌లో కూడా ఆర్సీబీ వేస్ట్ అని ప్రూవ్ అయిందని కొందరు జోకులు పేలుస్తున్నారు. ఇవన్నీ చూసిన ఆర్సీబీ ఫ్యాన్స్ చాలా బాధ పడుతున్నారు.

Story first published: Tuesday, March 7, 2023, 11:39 [IST]
Other articles published on Mar 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+