Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని డైట్ నాసా రెడీ చేసిందన్న పీసీబీ మాజీ చీఫ్.. ఎక్కడ చదువుకున్నావ్? అంటూ నెటిజన్ల ట్రోలింగ్!

వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన పాకిస్తాన్‌ ఇప్పుడు మరోసారి నవ్వులపాలైంది. ఆ దేశపు క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రజా వింత కామెంట్స్ చేశాడు. వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కూడా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇమామ్ ఉల్ హక్ వంటి ప్లేయర్లు కనీసం సింగిల్స్, డబుల్స్ తీయడానికి ఇబ్బంది పడ్డారని చాలామంది అన్నారు.

ఆ టీం మాజీ లెజెండ్ వసీం అక్రమ్ కూడా పాకిస్తాన్ ఫీల్డింగ్ పరమ చెత్తగా ఉందని, ఒక్కో ప్లేయర్ భారీగా మటన్ తింటున్నాడు కానీ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టడం లేదని మండిపడ్డాడు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్ల ఫిట్‌నెస్ గురించి తాజాగా ఒక టీవీ ఛానెల్‌లో డిబేట్ పెట్టారు. దానికి హాజరైన పీసీబీ మాజీ చీఫ్ రమీజ్ రజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫిట్‌నెస్ అనగానే అందరికీ గుర్తొచ్చే క్రిస్టియానో రొనాల్డో గురించి రజా మాట్లాడాడు.

Fans troll Ramiz Raza for Ronaldo diet made by NASA remarks

'మనం ఫుట్‌బాల్ గురించి మాట్లాడుకుందాం. రొనాల్డో డైట్‌ను నాసా సైంటిస్టులు రెడీ చేస్తారని మీకు తెలుసా?' అని యాంకర్‌ను అడిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు నవ్వలేక ఛస్తున్నారు. 'ఈ మనిషి మొన్నటి దాకా పీసీబీ చీఫ్. ఇంకా అతను ఉండాల్సిందని కొందరు డిమాండ్లు చేస్తున్నారంటే ఇక వాళ్ల తెలివిని అర్థం చేసుకోండి' అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

'నాసా వాళ్లు సైంటిస్టులు అనుకున్నావా? లేక డైటీషియన్లు అనుకున్నావా?' అంటూ కొందరు రజాను ట్రోల్ చేశారు. అసలు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయిరా నీకు? మీ పాకిస్తాన్‌లో చదువు అనే విషయంపై అసలు ఫోకస్ పెట్టరా? అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా తనకు తెలియకుండానే పిచ్చి కామెంట్ చేసిన రజా అభాసుపాలవుతున్నాడు. ఇది చూసిన చాలా మంది అతన్ని ఎగతాళి చేస్తూ నవ్వుకుంటున్నారు.

Story first published: Thursday, November 23, 2023, 18:52 [IST]
Other articles published on Nov 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+