హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన భార్య సఫా బేగ్ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళితే ఇర్ఫాన్ పఠాన్ తన భార్య ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అతను సరదాగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫొటో అతన్ని చిక్కుల్లో పడేసింది.
సగం ముఖం కనిపించేలా ఉన్న సఫా బేగ్ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. దాని క్రింద "This girl is trouble #love #wifey" అనే క్యాప్షన్ కూడా పెట్టాడు. పఠాన్ పోస్ట్ చేసిన వెంటనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇర్ఫాన్ నీవు చేసిన పని సరికాదు అంటూ విమర్శలు చేశారు.
భార్య ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొందరు ఫ్యాన్స్ నెగటివ్ కామెంట్స్ పెట్టారు. ఆ క్యాప్షన్‌ను మరి కొంతమంది తీవ్రంగా తప్పుబట్టారు. ఫిబ్రవరి 2016లో మక్కాలో సఫా బేగ్‌ని పఠాన్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.