పాక్ క్రికెటర్‌పై నెటిజన్ల ఆగ్రహం.. ఇక జట్టులోకి తీసుకోకూడదంటూ కామెంట్లు!!

కరాచీ: పాకిస్థాన్ పేసర్ హసన్ అలీపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అలీని మళ్లీ పాక్ జట్టులోకి తీసుకోకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెటిజన్ల ఆగ్రహానికి ఓ కారణం ఉంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు హసన్ అలీ అందుబాటులో లేడు. ఇక శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ప్రకటించిన పాక్ జట్టులో కూడా లేడు.

ర్యాంప్ వాక్ చేసిన అలీ:
పక్కటెముకల గాయంతో బాధ పడుతున్న కారణంగా అలీని పాక్ సెలెక్టర్లు పక్కన పెట్టారు. అబుధవారం (డిసెంబరు 11) నుంచి రావల్పిండి క్రికెట్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలాఉంటే.. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో హసన్ అలీ ర్యాంప్ వాక్ చేసాడు. ఈ సమయంలో అతను ఎలాంటి అసౌకర్యాలకు గురికాలేదు. బంగారపు రంగు షెర్వానీ ధరించిన హసన్ అలీ.. ర్యాంప్ వాక్ చేస్తూ చాలా ఉత్సాహంగా గడిపాడు.

జట్టులోకి తీసుకోకూడదు:
హసన్ అలీ ర్యాంప్ వాక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. తమదైన స్టయిల్లో కామెంట్లు పెడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి తిరిగి జట్టులోకి వస్తావనుకుంటే.. ర్యాంప్ వాక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావా అని ఓ నెటిజన్ మండిపడ్డాడు. 'ఆటను వదిలేసావు. మరి మోడలింగ్ ఎందుకు చేస్తున్నావు. గాయం అడ్డురావడం లేదా. నిన్ను అసలు మళ్లీ పాక్ జట్టులోకి తీసుకోకూడదు' అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేసాడు.

భారత యువతితో పెళ్లి:
హసన్ అలీ పాకిస్తాన్ తరఫున 53 వన్డేలు, 30 టీ20 మ్యాచ్‌లు, తొమ్మిది టెస్టులు ఆడాడు. గత ఆగస్టులో భారత్‌కు చెందిన యువతిని అలీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏరోనాటికల్ ఇంజినీర్ సామియా ఆర్జూను దుబాయ్‌లోని అట్లాంటిస్ హోటల్‌లో ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఇండియాలో పుట్టి పెరిగిన సామియా ఆర్జూ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటోంది. హోయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న సమయంలో ఆమె కొన్నాళ్ల క్రితం హసన్ అలీకి పరిచయమైం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications