Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్లెడ్జింగ్ చేసి.. జెర్సీలు మార్చుకుంటే సరిపోతుందా?

లక్నో, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అన్నదమ్ములు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ప్రత్యర్థులుగా కలిశారు. ఈ మ్యాచ్‌లో లక్నో తరఫున కృనాల్ అద్భుతంగా ఆడాడు. పవర్‌ప్లేలోనే రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్‌లో కూడా ఫర్వాలేదనిపించాడు. అదే సమయంలో గుజరాత్ విజయంలో హార్దిక్ పాండ్యా పాత్ర కూడా చాలా కీలకమే. మిగతా బ్యాటర్లు తేలిపోయిన చోట.. ఒంటరి పోరాటం చేసి 66 పరుగులతో రాణించాడు.

ఈ క్రమంలో ఈ అన్నదమ్ములిద్దరి మధ్య జరిగిన కొన్ని సంఘటనలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో కృనాల్ బ్యాటింగ్ చేస్తుండగా హార్దిక్ స్లెడ్జింగ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇది చూసిన కృనాల్ నవ్వేశాడు. దీంతో హార్దిక్ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఇద్దరూ స్లెడ్జింగ్ చేసుకొని నవ్వుకుంటున్న వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ మ్యాచ్‌లో గెలిచేలా కనిపించిన లక్నో చివరకు ఓటమి పాలైంది.

Fans troll Hardik and Krunal for changing jersey

లక్నో ఓడిపోయిన తర్వాత మళ్లీ కృనాల్, హార్దిక్ కలిశారు. ఇద్దరూ పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ తమ జెర్సీలు మార్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను హార్దిక్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నాడు. 'నేను ప్రేమించే ఒకే ఒక బ్రదర్' అని ఈ వీడియోకు క్యాప్షన్ తగిలించాడు.ఈ వీడియోలో వీళ్లిద్దరూ కలిసి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు.

అనంతరం షర్టులు మార్చుకున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ మరోసారి హార్దిక్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఆడేటప్పుడు స్లెడ్జింగ్ చేసి ఇప్పుడు జెర్సీ మార్చుకుంటే సరిపోతుందా? అని వెటకారం ఆడుతున్నారు. మరికొందరు మాత్రం ఈ అన్నదమ్ముల బాండింగ్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆటలో ఏం జరిగినా ఇద్దరూ ఇలా కలిసే ఉండాలని చెప్తున్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో చివరి వరకు క్రీజులో ఉన్నా కూడా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (68) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అంతేకాకుండా తన జిడ్డు బ్యాటింగ్‌తో లక్నో ఓటమికి కారణం అయ్యాడు. ఈ క్రమంలో అతన్ని కూడా ఫ్యాన్స్ తెగ తిడుతున్నారు. ప్రపంచ క్రికెట్‌లో అతి పెద్ద ఫ్రాడ్ అంటూ రాహుల్‌పై కామెంట్లు చేస్తున్నారు.

Story first published: Sunday, April 23, 2023, 16:15 [IST]
Other articles published on Apr 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+