Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెస్టు క్రికెట్‌లో మ్యాచ్ విన్నర్లు వీళ్లే అన్న భజ్జీ.. తెగ ట్రోల్ చేసిన ఫ్యాన్స్!

యాషెస్ సిరీస్ జరుగుతున్న వేళ అందరూ టెస్టు క్రికెట్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ట్వీట్ చేసిన టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు. జులై 3న 43వ బర్త్‌డే జరుపుకున్న ఈ మాజీ క్రికెటర్‌కు మరుసటి రోజు తెల్లారే నరకం చూపించారు. అంత పెద్ద క్రికెటర్‌వి, ఇది కూడా తెలీదా? అంటూ జోకులు పేలుస్తున్నారు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో గేమ్ ఛేంజర్లు, మ్యాచ్ విన్నర్లు ఎవరు? అనే ప్రశ్నకు భజ్జీ బదులివ్వడమే అతను చేసిన నేరం.

నెట్టింట క్రికెట్‌కు సంబంధించిన కంటెంట్‌తో బాగా పాపులర్ అయిన ఒక సీనియర్ క్రికెట్ జర్నలిస్టు.. తాజాగా ఒక ప్రశ్న వేశాడు. 'ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో బెస్ట్ ప్లేయర్లు ఎవరు? కేవలం స్కిల్స్ పరంగా కాదు. గేమ్ ఛేంజర్లు, మ్యాచ్ విన్నర్లు.. పెద్ద మ్యాచుల్లో రాణించే వాళ్ల గురించి అడుగుతున్నా. నేను రెండు పేర్లు చెప్తా.. బెన్ స్టోక్స్, ప్యాట్ కమిన్స్. మిగతా మూడు మీరు చెప్పండి' అని ట్వీట్ చేశాడు.

Harbhajan Singh

దీనిపై భజ్జీ స్పందించాడు. తన దృష్టిలో బెస్ట్ టెస్టు ప్లేయర్లు అంటూ.. నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్ పేర్లు చెప్పాడు. ప్రశ్న వేసిన యూజర్ చెప్పిన ప్యాట్ కమిన్స్‌ను వదిలేశాడు. అయితే ఈ పేర్ల స్పెల్లింగులను భజ్జీ తప్పుగా రాశాడు. జడ్డూ, పంత్ పేర్లు కూడా సరిగా రాయలేదు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ పేరు మాత్రమే సరిగా రాశాడు. తెల్లవారు జామున ఈ ట్వీట్ చేసిన భజ్జీ.. నిద్రలో ఈ తప్పులు చేశాడేమో తెలియదు.

Harbhajan Singh

ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ (Steve Smith) పేరును తప్పుగా 'Steav Smith' అని రాశాడు. అలాగే బెన్ స్టోక్స్ (Ben Stokes) పేరును 'Ben strokes' (బెన్ స్ట్రోక్స్) అని రాసేశాడు. రిషభ్ పంత్ (Rishabh Pant) పేరును 'Rishab Panth' అని, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) పేరును 'Ravinder Jadeja' అని రాశాడు. ఇలా ఐదుగురిలో నలుగురి పేర్లు తప్పుగా రాయడంతో భజ్జీని ఒక ఆట ఆడుకున్నారు. ఇంతకీ ఈ స్టోక్స్ ఎవరు? అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే.. స్టీవ్ స్మిత్ స్పెల్లింగ్ కూడా తప్పుగా రాశావా? అని మరికొందరు షాకవుతున్నారు.

Story first published: Tuesday, July 4, 2023, 15:08 [IST]
Other articles published on Jul 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+