
కొత్త నిబంధన తెచ్చిన అఫ్రిదీ
తాజాగా పాకిస్తాన్ చీఫ్ సెలెక్టర్‌గా నియమితుడైన షాహిద్ అఫ్రిదీ కూడా ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇకపై డొమెస్టిక్ క్రికెట్‌లో ఆటగాళ్ల స్ట్రైక్ రేటుపై ప్రత్యేక ఫోకస్ ఉంటుందని చెప్పిన అఫ్రిదీ.. 'దేశవాళీల్లో 135 కన్నా తక్కువ స్ట్రైక్ రేటు ఉన్న ఆటగాళ్లను టీ20 క్రికెట్‌కు సెలెక్ట్ చేయడం జరగదు' అని తేల్చేశాడట.
అయితే ఈ నిబంధన కేవలం పాకిస్తాన్‌లో డొమెస్టిక్ క్రికెట్ ఆడే ఆటగాళ్లకేనా? లేక అంతర్జాతీయ క్రికెటర్లకా అనే వివరాలు బయటకు రాలేదు. అయితే ప్రస్తుత పాకిస్తాన్ జట్టులో ఇద్దరు ముగ్గురు ఆల్‌రౌండర్లు తప్ప మిగతా ఆటగాళ్లలో ఒక్కరి స్ట్రైక్ రేటు కూడా 130 కన్నా ఎక్కువ లేదు. దీంతో అఫ్రిదీ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

సీక్రెట్ మీటింగ్‌లో నిర్ణయం..
పాకిస్తాన్ క్రికెట్‌ను మెరుగు చేయడం గురించి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్, పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సేథీ, షాహిద్ అఫ్రిదీ కలిసి ఒక సీక్రెట్ మీటింగ్‌లో చర్చించారట. ఈ సమావేశం తర్వాతనే స్ట్రైక్ రేటు విషయంలో ఒక బెంచ్ మార్క్ ఉండాలని అఫ్రిదీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
ఇది విన్న తర్వాత నెటిజన్లు ఊరుకుంటారా? అఫ్రిదీ చెప్పిన రేంజ్‌లో బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ స్ట్రైక్ రేటు కూడా లేదు. ఇదే విషయాన్ని ఎత్తి చూపిన నెటిజన్లు.. ఇలాగైతే బాబర్, రిజ్వాన్ ఇద్దరూ రిటైర్‌మెంట్ తీసుకోవాల్సిందేగా? అంటూ జోకులు పేలుస్తున్నారు.

టీ20ల్లో బాబర్, రిజ్వాన్
బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరూ కూడా పాకిస్తాన్ తరఫున టీ20ల్లో బెస్ట్ ఆటగాళ్లే. కొంతకాలం క్రితం ఇద్దరూ ఈ ఫార్మాట్లో నెంబర్ వన్ బ్యాటర్లుగా కూడా నిలిచారు. అయితే వీళ్లిద్దరి స్ట్రైక్ రేట్లు కేవలం 126-127ల్లోనే ఉన్నాయి. ఆసియా కప్‌లో మహమ్మద్ రిజ్వాన్‌పై వచ్చిన విమర్శలు కూడా ఇవే. అతను యావరేజి కోసం ఆడుతున్నాడు కానీ.. బంతులన్నీ తినేస్తున్నాడని అభిమానులు మండిపడ్డారు. ఇప్పుడు అఫ్రిదీ చేసిన వ్యాఖ్యలతో ఈ ఇద్దరి బ్యాటింగ్‌పై ఫ్యాన్స్ మరింత ఫోకస్ పెట్టనున్నారు.


Click it and Unblock the Notifications












