For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2023: గిల్ విషయంలో చేసిన మోసానికి ఇప్పుడు శిక్ష.. ఆసీస్ పేసర్‌పై పేలుతున్న మీమ్స్!

చేసిన పాపం ఊరికే పోదనేది పాత సామెత. ఇప్పుడు ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ విషయంలో అదే జరిగింది. భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గిల్‌ను తప్పుడు క్యాచ్‌తో అవుట్ చేశాడీ ఆసీస్ ప్లేయర్. బంతి నేలకు తాకినా కూడా క్యాచ్‌కు అప్పీల్ చేశాడు. థర్డ్ అంపైర్ కూడా అది కరెక్ట్ క్యాచ్ అంటూ గిల్‌ను అవుట్ ఇచ్చాడు. అప్పుడు ఈ నిర్ణయం చాలా వివాదాస్పదమైంది.

ఇప్పుడు యాషెస్ సిరీస్‌లో కూడా అలాంటి ఒక నిర్ణయమే వివాదాస్పదమైంది. యాషెస్ రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇది జరిగింది. రెండో ఇన్నింగ్స్‌లో కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న మిచెల్ స్టార్క్ వేగంగా పరుగు తీస్తూ వచ్చి, ముందుకు దూకి మరీ క్యాచ్ అందుకున్నాడు.

shubmangill

కానీ ల్యాండింగ్ సమయంలో అతని చేతిలో బంతి నేలకు తాకింది. డకెట్ తను అవుట్ అనుకొని మైదానం వీడేందుకు రెడీ అయ్యాడు. కానీ థర్డ్ అంపైర్ ఈ క్యాచ్‌ను నాటౌట్ అని ప్రకటించాడు. ఇది చూసిన ఆసీస్ ప్లేయర్లు షాకైపోయారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెళ్లి అంపైర్లతో ఇదే విషయం గురించి చర్చించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు గ్రీన్‌ను టార్గెట్ చేస్తున్నారు.

గిల్ విషయంలో ఆస్ట్రేలియా చేసిన తప్పుకు ఇప్పుడు ఇలా శిక్ష పడిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో.. అసలు క్యాచ్‌ను అవుట్‌గా ఎలా ప్రకటిస్తారని అడుగుతున్నారు. ఫీల్డర్ పూర్తిగా కంట్రోల్‌లో ఉండాలా? లేక బంతి నేలకు తాకకూడదా? అనే విషయం తమకు అర్థం కావడలేదని, అంపైర్ల నిర్ణయాల వల్ల క్రికెట్ రూల్స్ తెలియకుండా పోతున్నాయని అంటున్నారు.

Story first published: Sunday, July 2, 2023, 15:08 [IST]
Other articles published on Jul 2, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+