Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ashes 2023: ఇలా ఎవరైనా అవుట్ చేస్తారా?.. ఆసీస్‌కు చీటింగ్ అలవాటే అంటున్న ఫ్యాన్స్!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బెయిర్‌స్టో అవుటైన విధానం వివాదాస్పదమైంది. అతన్ని అవుట్ చేసినందుకు ఆసీస్ జట్టును ఫ్యాన్స్ అందరూ తిట్టిపోస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ బెన్ డకెట్ మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ క్రమంలో బెయిర్‌స్టోపై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఈ మ్యాచ్‌లో బెయిర్‌స్టో (10) ఫెయిలయ్యాడు. కామెరూన్ గ్రీన్ వేసిన షార్ట్ బాల్‌ను బెయిర్‌స్టో తప్పుకున్నాడు. బంతి కీపర్ వైపు వెళ్లగానే క్రీజులో నుంచి ముందుకొచ్చాడు. సాధారణంగా బంతిని లీవ్ చేసేసిన తర్వాత క్రీజులో ఒకసారి బ్యాటు ఉంచో, లేదంటే అంపైర్‌కు సైగ చేసో బ్యాటర్లు ముందుకు వచ్చేయడం జరుగుతూనే ఉంటుంది. బెయిర్‌స్టో కూడా అదే చేశాడు. అయితే ఆసీస్ కీపర్ అలెక్స్ క్యారీ దీన్ని ఒక అవకాశంగా తీసుకున్నాడు.

Fans troll Australia team for unethical stump-out of Bairstow

బెయిర్‌స్టో క్రీజు వదలగానే తన చేతిలోని బంతిని వికెట్ల మీదుకు విసిరాడు. అది వికెట్లను కూల్చగానే స్టంపౌట్ కోసం అప్పీల్ చేశాడు. అతనితోపాటు ఆసీస్ టీం అంతా అప్పీల్ చేసింది. అంపైర్ దీన్ని పరిశీలించిన బెయిర్‌స్టోను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో ఇంగ్లండ్ ఫ్యాన్స్ షాకైపోయారు. వదిలేసిన బంతితో రనౌట్ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం అని మండిపడ్డారు. ఆసీస్ టీంను 'బూ...' చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

దీనిపై ఆసీస్ దిగ్గజం బ్రాడ్ హాగ్ కూడా అసహనం వ్యక్తం చేశాడు. క్రీడాస్ఫూర్తిని చివరి హద్దు వరకూ తోసేశారంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఇలా బెయిర్‌స్టో అవుట్ అవడంతో ఇంగ్లండ్ విజయావకాశాలు బాగా దెబ్బతిన్నాయి. జట్టును గెలిపించే భారం అంతా కెప్టెన్ బెన్‌స్టోక్స్ మీదనే పడింది. ఈ క్రమంలోనే ఆసీస్ టీం ఎప్పుడూ ఇలా చీటింగ్ చేస్తూనే ఉంటుందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Story first published: Sunday, July 2, 2023, 19:30 [IST]
Other articles published on Jul 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+