టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. కొన్నిరోజుల క్రితం వెస్టిండీస్ టూర్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. కేవలం టెస్టు మ్యాచులు ఆడాడు. ఆ తర్వాత జరిగిన వైట్ బాల్ సిరీసులో తొలి వన్డే మాత్రమే ఆడాడు. మిగతా వన్డేల్లో అతనికి విశ్రాంతి ఇవ్వగా.. టీ20 సిరీసు ఆడిన జట్టులో అతను లేడు
ఈ క్రమంలో అక్కడే కొంత కాలం ఎంజాయ్ చేసిన కోహ్లీ.. తన భార్య అనుష్క శర్మతో కలిసి షికార్లు చేశాడు. ఈ సందర్భంగా బార్బడోస్‌లో ఒక కేఫ్‌కు వెళ్లిన ఈ జంట బాగా ఎంజాయ్ చేసిందట. దీంతో ఆ కేఫ్ ముందు ఇద్దరూ నిలబడి ఫొటో దిగారు. దీన్ని సోషల్ మీడియాలో పంచుకున్న విరాట్ కోహ్లీ.. 'బార్బడోస్‌లో కచ్చితంగా వెళ్లాల్సిన ప్లేస్' అని పోస్టు పెట్టాడు.

ఈ పోస్టులో కోహ్లీ బ్లాక్ టీ-షర్ట్, షార్ట్స్ వేసుకొని ఉన్నాడు. అనుష్క లూజ్ బ్లూ షర్ట్, షార్ట్ వేసుకొని ఉంది. ఈ క్రమంలో ఆమె చాలా సన్నగా కనిపించింది. ఇది చూసిన చాలా మంది నెటిజన్లు అనుష్కను బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్లు పెట్టారు. ఆమె చేతిలో నరాలు కనిపిస్తున్నాయని, తిండి తినాలంటూ ఎగతాళి చేశారు.
ఆ కాళ్లు అంత సన్నగా వేసుకొని ఎంత దరిద్రంగా ఉన్నావో తెలుసా? అంటూ కొందరు కామెంట్స్ చేశారు. 'ఈ కాళ్లు చూడలేకపోతున్నాం.. అనుష్కకు ప్యాంట్ ఇవ్వండి' అని మరొకరు జోక్ చేశారు. డబ్బులు ఎక్కువైన తర్వాత జనాలకు బట్టల విలువ తెలియడం లేదంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.
ఇలా అనుష్కను బాడీ షేమింగ్ చేయడాన్ని కొందరు ఫ్యాన్స్ తప్పుబట్టారు. కానీ చేసేవాళ్లు మాత్రం ఆగలేదు. కాగా, శుక్రవారంతో కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 15 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే.