ముంబై: తాను క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ను క్షమించలేనని సబీనా ఖటూన్ అంటోంది. ఇర్ఫాన్ పఠాన్ ను ముద్దు పెట్టుకోబోయి ఆమె సోమవారం విఫలమైంది. ముద్దు పెట్టుకోబోయిన ఆమెను ఇర్ఫాన్ పఠాన్ తోసివేశాడు. ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించిన తనను ఏదో నేరం చేసినదానిలాగా చూసి ఇర్ఫాన్ తనను తోసివేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆమె ఒక ఇంటర్వ్యూలో అంది. తాను ఇబ్బంది పడాల్సిందేమీ లేదని, ఇద్దరు కలిసినప్పుడు కౌగలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం మామూలేనని, అలాగే తాను ఇర్ఫాన్ ను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించానని ఆమె వివరించింది. తాను ఇర్ఫాన్ ను చూస్తానని కూడా అనుకోలేదని, తాను తనకు ఆ అవకాశం వచ్చిందని, అందువల్ల అతన్ని ముద్దు పెట్టుకోవాలని ముందే పథకం వేసుకోవడం ఎలా సాధ్యమవుతుందని ఆమె అంటోంది. తాను ఇంకా ఇర్ఫాన్ ను ఇష్టం పడడం లేదని, తన మనోభావాలను అతను దెబ్బ తీశాడని, అతన్ని క్షమించలేనని ఆమె అంటోంది. టీవీ చానెళ్లు ఈ వ్యవహారాన్ని తప్పుడుగా వ్యాఖ్యానించాయని ఆమె అంటోంది. ఈ వ్యవహారంపై తన తండ్రి కొంత బాధపడ్డాడని, మిగతా కుటుంబ సభ్యులతో సమస్య లేదని, తన మిత్రులు కూడా ఏమీ తప్పుగా అనుకోవడం లేదని ఆమె వివరించింది.