INDvsAUS : అతన్నే వైస్ కెప్టెన్ చేయాలన్న భజ్జీ.. దారుణంగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

టెస్టు క్రికెట్‌లో వరుస వైఫల్యాల కారణంగా టీమిండియా వైస్ కెప్టెన్ పదవిని కేఎల్ రాహుల్ కోల్పోయాడు. ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించే సమయంలో సెలెక్టర్లు అతన్నే కాదు, ఎవర్నీ జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయలేదు. ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజం హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైస్ కెప్టెన్ పదవికి మరో స్టార్ పేరును అతను ప్రతిపాదించాడు. ఇది అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో అతనిపై చురకలు వేయడం మొదలు పెట్టారు.

అశ్విన్ ఎందుకు వద్దు?
తన యూట్యూబ్ ఛానెల్‌లో ఈ వైస్ కెప్టెన్ సమస్య గురించి భజ్జీ మాట్లాడాడు. ఈ వీడియో లింక్‌ను తన ట్విట్టర్ ఖాతాలో కూడా అతను షేర్ చేశాడు. ఈ సమయంలో తన పోస్టులో చిన్న పొరపాటు చేశాడు. దాన్ని కూడా ఫ్యాన్స్ వదల్లేదు. భజ్జీని దారుణంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అలాగే అశ్విన్‌కు ఈ పోస్టు ఎందుకు ఇవ్వకూడదు? అంటూ ప్రశ్నించారు. అశ్విన్‌ను ఎప్పుడూ తక్కువ చేయడానికి భజ్జీ ప్రయత్నిస్తుంటాడని అభిమానుల భావన. ఆసీస్ సిరీస్ మొదలవడానికి ముందు కూడా ఇలాగే జరిగింది.

అశ్విన్ అంటే కుళ్లు..
మాజీ లెజెండ్ వసీం జాఫర్.. సిరీస్ మొదలవలేదు కానీ ఆసీస్ బుర్రలో అప్పుడే అశ్విన్ చేరాడంటూ ట్వీట్ చేశాడు. అయితే వాళ్ల బుర్రలో ఉంది అశ్విన్ కాదని, స్పిన్‌కు సహకరించే పిచ్‌లు అని భజ్జీ కకామెంట్ చేశాడు. అప్పుడే అతన్ని నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు. మళ్లీ ఇప్పుడు భజ్జీ చేసిన కామెంట్లపై అలాగే రియాక్ట్ అవుతున్నారు. 'అశ్విన్ నీ కన్నా గొప్ప బౌలర్ అని నీకు కుళ్లు అంతే' అంటూ మండిపడ్డారు. అశ్విన్ మీద పడి ఎందుకంతలా ఏడుస్తావ్? అని కూడా తిట్టిపోశారు. మూడో టెస్టులో కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టి శుభ్‌మన్ గిల్‌తో ఓపెనింగ్ చేయిస్తారా? అని తన యూట్యూబ్ ఛానెల్‌లో భజ్జీ వివరించాడు.

వీసా కెప్టెన్ ఎవరు?
అలాగే రెండు మ్యాచుల్లో రాణించిన రవీంద్ర జడేజాను టెస్టుల్లోనే కాదు, వన్డేల్లోనూ వైస్ కెప్టెన్ చేయాలన్నాడు. అలాగే తన పోస్టులో 'వైస్ కెప్టెన్' అని రాయడానికి బదులు పొరపాటున 'వీసా కెప్టెన్' అని రాసేశాడు. తన పొరపాటు గుర్తించిన అతను వెంటనే ఈ పోస్టును డిలీట్ చేసేశాడు. కానీ ఫ్యాన్స్ దృష్టి నుంచి ఇది తప్పించుకోలేకపోయింది. దీనిపై ఫ్యాన్స్ వైల్డ్‌గా రియాక్ట్ అయ్యారు. మరి అశ్విన్‌ను ఏం చేద్దాం? అని కొందరు అడుగుతున్నారు. మరికొందరేమో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా జడేజా విఫలమయ్యాడు. అతనిపై ఈ పని భారం పెడితే అతని ఆటతీరు కూడా దెబ్బతింటుందని భజ్జీకి క్లాస్ పీకారు. ఇంకొందరు 'ఈ వీసా కెప్టెన్ ఎవరు?' అని జోకులు వేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications