INDvsAUS : థర్డ్ అంపైర్ కళ్లు దొబ్బాయా?.. కోహ్లీ అవుట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీకి దురదృష్టం పట్టింది. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ మంచి స్కోరు చేసేలా కనిపించాడు. టాపార్డర్ ముగ్గురూ వెంటవెంటనే అవుటవడంతో కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. ఒక ప్లాన్ ప్రకారం స్పిన్నర్లను ఎదుర్కొన్న అతను క్రీజులో చక్కని కమాండ్‌తో కనిపించాడు. అతని ఆటతీరు చూస్తే కచ్చితంగా భారీ స్కోరు చేసేలా కనిపించాడు. కానీ దురదృష్టం మాత్రం అతని ఆశలపై నీళ్లు చల్లింది. లంచ్ తర్వాత కొంత వేగం పెంచి ఆడుతున్న అతను.. 44 పరుగుల స్కోరు వద్ద అవుటయ్యాడు.

కునెమన్ బౌలింగ్‌లో..
అరంగేట్రం ఆటగాడు కునెమన్ వేసిన ఓవర్లో ఫ్రంట్ ఫుట్‌పై డిఫెన్స్ ఆడేందుకు కోహ్లీ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి అతని బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి వెళ్లి వెనక కాలికి తగిలింది. ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ అవుటిచ్చాడు. అయితే బంతి తన బ్యాటుకు తగిలిందని బలంగా నమ్మిన కోహ్లీ రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి ముందుగా బ్యాటును తాకిందా? లేక ప్యాడ్‌ను తాకిందా? స్పష్టంగా కనిపించలేదని థర్డ్ అంపైర్ అభిప్రాయపడ్డాడు. రకరకాల యాంగిల్స్‌లో ఈ ఫుటేజిని పరిశీలించాడు.

ఫుటేజీ చూస్తే..
చివరకు ముందుగా ప్యాడ్‌నే బంతి తాకిందనే నిర్ధారణకు వచ్చాడు. దీంతో ఎల్బీడబ్ల్యూ చెక్ చేయగా బంతి వికెట్లను తాకుతుందా? లేదా? అనేది అంపైర్స్ కాల్ అయింది. ఇది చూసిన ఆన్‌ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయంపైనే నిలబడ్డాడు. ఇక చేసేదేం లేక కోహ్లీ నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. ఇలా వెళ్లే సమయంలో అంపైర్ వైపు రెండు, మూడు సార్లు చాలా సీరియస్‌గా చూశాడు. ఈ ఫుటేజి చూసిన అభిమానులు కూడా మండిపడుతున్నారు. అంపైర్ నితిన్ మీనన్ ఎప్పుడూ ఇలాంటి చెత్త నిర్ణయాలే ఇస్తుంటాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కళ్లు దొబ్బాయా..?
'కోహ్లీకి ఈ దురదృష్టం ఎందుకు పట్టిందో తెలీదు. ఎప్పుడు ఇలా కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా కూడా.. కోహ్లీకి వ్యతిరేకంగానే నిర్ణయం ఉంటుంది' అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో అంపైర్‌ల అర్హతను ప్రశ్నిస్తున్నారు. భారత్‌లో ఎప్పుడు సిరీస్ జరిగినా అంపైర్ల నిర్ణయాలు ఇలా వివాదాస్పదం అవడం కనిపిస్తూనే ఉంటుందని కొందరు విమర్శిస్తున్నారు. కోహ్లీ విషయంలో మాత్రం బంతి ముందుగా బ్యాటునే తాకిందని చాలా స్పష్టంగా కనిపిస్తోందని, అయినా అతన్ని అవుటివ్వడం ఘోరమని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థర్డ్ అంపైర్ కళ్లుదొబ్బాయా? అని ఇంకొంత మంది తిట్టిపోస్తున్నారు. మరి రెండో ఇన్నింగ్స్‌లో అయినా కోహ్లీ తన మార్క్ ఆటతో భారీ స్కోరు చేస్తాడేమో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications