INDvsAUS : ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను వాడుకోవడం రాదా?.. రోహిత్ వ్యూహాలపై ఫ్యాన్స్ ఫైర్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు ఓటమి అంచున నిలిచింది. తొలిసారి ఈ సిరీసులో ఆసీస్ కన్నా టీమిండియా వెనుక పడింది. అయితే అభిమానులు మాత్రం ఈ పరిస్థితి చూసి రోహిత్ శర్మపై మండిపడుతున్నారు. ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను వాడుకోవడం రాదంటూ తిట్టిపోస్తున్నారు. రోహిత్ తప్పిదాల వల్లే భారత జట్టు ఓటమి అంచున నిలిచిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓటమి అంచున భారత్..
నాగ్‌పూర్, ఢిల్లీలో బౌలర్లకు పూర్తిగా సహకరిస్తున్న పిచ్‌పై భారత బ్యాటర్లు కూడా తడబడ్డారు. కానీ ఆ జట్టును అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. ఈ రెండు మ్యాచుల్లో వరుస పెట్టి హాఫ్ సెంచరీలు చేసిన అతను.. భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్సులతో ఆదుకున్నాడు. రెండు మ్యాచుల్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. కానీ ఇండోర్‌లో మాత్రం అతన్ని సరైన స్థానంలో బ్యాటింగ్‌కు పంపలేదు. ఇక బ్యాటర్లు ఎవరూ లేరు అనే సమయంలో అతన్ని క్రీజులోకి పంపారు. కానీ అతనికి అవతలి ఎండ్ నుంచి ఎలాంటి సహకారం రాలేదు. దీంతో భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఓటమి అంచున నిలిచింది.

వరుసగా హాఫ్ సెంచరీలు..
తను ఆడిన రెండు మ్యాచుల్లో వరుసగా హాఫ్ సెంచరీలు చేసిన అతన్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో పైకి పంపించాలని చాలా మంది సూచించారు. ఇండోర్‌లో భారత బ్యాటింగ్ చాలా కష్టాలు పడిన సంగతి తెలిసిందే. పిచ్ నుంచి బౌలర్లకు పూర్తి సహకారం అందడంతో బ్యాటర్లంతా చేతుల్తేతేశారు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్ మాత్రం చివరకు నాటౌట్‌గా నిలిచాడు. అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా అక్షర్ నాటౌట్‌గా నిలిచాడు. కానీ అవతలి ఎండ్‌లో సరిగా నిలబడే బ్యాటర్ లేకపోవడంతో అతను ఏం చెయ్యలేకపోయాడు.

రోహిత్‌పై ఆగ్రహం..
ఇదే విషయాన్ని ఎత్తి చూపుతున్న అభిమానులు.. అంత గొప్ప ఫామ్‌లో ఉన్న ఆటగాడిని కొంచెం ముందుగానే క్రీజులోకి పంపి ఉండాల్సిందని అంటున్నారు. మాజీ లెజెండ్ వసీం జాఫర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అక్షర్‌కు చివరి ముగ్గురు బ్యాటర్ల నుంచి సహకారం అందాల్సి ఉందని, కానీ వాళ్లు ఈ పిచ్‌పై పూర్తిగా విఫలమయ్యారని జాఫర్ కూడా నిర్ణయించాడు. దీంతో అక్షర్ ఒక్కడే చివరకు నాటౌట్‌గా మిగిలిపోయాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని ఎత్తి చూపుతున్న ఫ్యాన్స్.. రోహిత్ చెత్త వ్యూహాలపై మండిపడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications