Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2023 : డివిల్లీర్స్ పేరు చెప్పి.. కోహ్లీని టార్గెట్ చేసిన గంభీర్?.. ఫ్యాన్స్ ఆగ్రహం!

Fans slam Gambhir for indirect dig at Kohli and targeting de Villiers

ఐపీఎల్ లెజెండ్స్ పేర్లు వరుసగా రాస్తూ పోతే కచ్చితంగా ఏబీ డివిల్లీర్స్ పేరును వదిలిపెట్టలేం. టీమ్స్‌తో సంబంధం లేకుండా అందరూ డివిల్లీర్స్ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేస్తారు. అయితే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం డివిల్లీర్స్ బ్యాటింగ్‌పై పెదవి విరిచాడు. డివిల్లీర్స్ కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడేవాడని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌ కెప్టెన్ రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన గంభీర్.. డివిల్లీర్స్ ఒక్క సారి కూడా ట్రోఫీ నెగ్గలేదని విమర్శించాడు.

డివిల్లీర్స్ కన్నా సురేష్ రైనా మెరుగైన బ్యాటర్ అని గంభీర్ చెప్పాడు. 'ఏబీ డివిల్లీర్స్ తన కెరీర్‌లో 8-10 ఏళ్లు చిన్నస్వామి స్టేడియం వంటి చిన్న మైదానంలో ఆడాడు. అక్కడ ఆడితే ఏ ఆటగాడికైనా డివిల్లీర్స్‌కు ఉన్న స్ట్రైక్ రేట్, సత్తా ఉన్నాయనే అనిపిస్తుంది. సురేష్ రైనా నాలుగు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టులో సభ్యుడు. కానీ డివిల్లీర్స్ వద్ద మాత్రం వ్యక్తిగత రికార్డులు మాత్రమే ఉన్నాయి' అని గంభీర్ స్పష్టం చేశాడు. గంభీర్ మాటలు విన్న తర్వాత అభిమానులు మండిపడుతున్నారు. డివిల్లీర్స్‌ పేరు చెప్తూ కోహ్లీని గంభీర్ విమర్శిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయితే.. అక్కడ గంభీర్ రికార్డులు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 'నేనేం రైనాను తక్కువ చేయడం లేదు. కానీ గంభీర్‌పై కోపంగా ఉన్నా. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో ఎవరైనా పరుగులు చేయగలరు అని గంభీర్ అనడం.. పరోక్షంగా కోహ్లీపై చేసిన కామెంట్. అదే స్టేడియంలో గంభీర్ స్ట్రైక్ రేట్ 126 అని మర్చిపోకూడదు' అని ఒక అభిమాని కామెంట్ చేశాడు. మరికొంత మంది కూడా గంభీర్‌ది నోటి దూల అంటూ మండిపడుతున్నారు. ఎప్పుడూ కోహ్లీని టార్గెట్ చేస్తుంటాడని తిడుతున్నారు.

Story first published: Sunday, March 5, 2023, 16:35 [IST]
Other articles published on Mar 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+