AUSvsSA: ఇండియాలో అయితే పెద్ద ఇష్యూ.. ఇప్పుడు సమస్య కాదా?.. గబ్బా పిచ్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం

కొన్నేళ్ల క్రితం చెన్నై వేదికగా ఒక టెస్టు మ్యాచ్ జరిగింది. పిచ్ పూర్తిగా టెస్టుకు సహకరించేలా దాన్ని తయారు చేశారు. దీంతో కేవలం రెండ్రోజుల్లోనే ఆ మ్యాచ్ ముగిసింది. దీంతో మాజీలంతా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మండి పడ్డారు. ఇలాంటి పిచ్ ఎలా తయారు చేస్తారు? ఇది టెస్టు క్రికెట్ నాశనానికే అంటూ రకరకాల కామెంట్లు చేసి భారత్‌ను తిట్టిపోశారు.

ఇదేం పిచ్?
ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే.. 2022 లో డిసెంబర్ 18 ఆదివారం, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య మొదలైన తొలి మ్యాచ్ కూడా రెండో రోజు ముగిసింది. పూర్తిగా పచ్చగా ఉండేలా ఈ పిచ్‌ను తయారు చేశారు. దీనికితోడు అనూహ్యమైన బౌన్స్ కూడా దొరుకుతోంది. రోజులు గడిచినా పిచ్‌లో మార్పు వచ్చే సూచనలు లేవు. దీంతో పేసర్లు పండగ చేసుకున్నారు. బ్యాటర్లు ఏమాత్రం స్వేచ్ఛగా ఆడలేకపోయారు. ఈ క్రమంలో చాలా లో స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. చివరకు రెండో రోజు కూడా ఆట పూర్తిగా జరగకముందే ఆస్ట్రేలియా నెగ్గింది. ఈ పిచ్ చూసిన అభిమానులు కూడా ఆస్ట్రేలియాపై మండి పడుతున్నారు.

అంపైర్లను కూడా అడిగా..
ఈ పిచ్ గురించి ఆస్ట్రేలిమా మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీనికి కచ్చితంగా ఐసీసీ నుంచి తక్కువ రేటింగ్ వస్తుందని అభిప్రాయపడ్డాడు. అంతేకానీ పిచ్ తయారు చేసిన వాళ్లన కానీ, క్రికెట్ ఆస్ట్రేలియాను కానీ ఒక్క మాట కూడా అనలేదు. ఇలాంటి సమయంలో సఫారీ సారధి డీన్ ఎల్గార్ మాత్రం.. తనకు ఆ పిచ్‌పై కొన్ని అనుమానాలు ఉన్నాయన్నాడు. 'పిచ్‌పై రబాడ, నోర్యీ బౌలింగ్ చేయడం చూసిన తర్వాత మ్యాచ్ నాశనమైపోయిందని నాకు అర్థమైపోయింది. పిచ్ ఏమాత్రం మారడం లేదు ఇదే విషక్ష్ం అంపైర్లను అడిగా. కానీ మేం పరుగులు చేయలేకపోవడంతో అలా అడిగామని వాళ్లు అనుకుననట్లున్నారు' అన ఎల్గార్ వివరించాడు.

ఇదసలు టెస్టు క్రికెటేనా?
తొలి టెస్టు సరైన టెస్టు క్రికెట్‌లా అనిపించలేదని ఎల్గార్ అన్నాడు. కేవలం రెండ్రోజుల్లో 34 వికెట్లు పడ్డాయని, మ్యాచ్ ఆసాంత ఏకపక్షంగా సాగిందని ఆరోపించాడు. ఇలాంటి పిచ్‌లు టెస్టు క్రికెట్‌కు ఎలాంటి మేలు చేయవన్నాడు. టెస్టు క్రికెట్ నాలుగు, ఐదు రోజులకు వెళ్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అభిమానులు కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. భారత మాజీ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చెన్నై పిచ్‌ను విమర్శించిన వారికి చురకలేశాడు. గబ్బా పిచ్‌పై వాళ్లెవరూ పెదవి విప్పలేదంటేనే వారిలో ఉన్న హిపోక్రసీ అర్థం అవుతోందన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications