For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక్క బంతి పడకుండా మ్యాచ్ రద్దు: బీసీసీఐపై అభిమానుల మండిపాటు

Fans Slam BCCI After India-South Africa Dharamshala T20I Gets Washed Out

హైదరాబాద్: ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో బీసీసీఐపై క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆరు నెలలు తర్వాత భారత్‌లో టీ20 మ్యాచ్ జరుగుతుండటంతో ధర్మశాల టీ20కి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

దేశ రాజధాని ఢిల్లీతో పాటు పక్కనే ఉన్న చండీగఢ్‌ల నుంచి భారీగా అభిమానులు భారీగా తొలి టీ20ని వీక్షించేందుకు ధర్మశాలకు చేరుకున్నారు. పదిరోజులకు ముందుగానే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. అయితే, గత నెలరోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుడంటంతో ధర్మశాల నుంచి మ్యాచ్‌ను తరలించొచ్చు కదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది.

ధర్మశాల నుంచి మ్యాచ్‌ని వేరొక వేదికకు తరలించే ఉండి ఉంటే మ్యాచ్‌ని వీక్షించేవాళ్లం కదా అని అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాదిన భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే మహారాష్ట్ర మొత్తం వరదలు, భారీ వర్షాలతో అతలాకుతలమైన సంగతి తెలిసిందే.

వర్షాకాలంలో ధర్మశాలను మ్యాచ్‌ కోసం ఎంపిక చేయడమే తప్పని ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బీసీసీఐ ఆడే అన్ని మ్యాచ్‌లకు ఇన్సూరెన్స్ ఉన్న నేపథ్యంలో ధర్మశాల టీ20 రద్దు అవడంతో ఆ బీమా సొమ్ముని దక్కించుకుంటుంది. కాగా, ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దవడంతో టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు డబ్బు తిరిగి ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది.

ఆదివారం ఉదయం నుంచే ధర్మశాలలో వర్షం పడుతుండటంతో మ్యాచ్‌ జరుగుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి. సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పడుతుందని భావించినప్పటికీ.. రాత్రి 7 గంటల సమయంలో వర్షం పెద్దది అవడంతో పాటు మైదానంలో నీళ్లు నిలిచాయి. ఐదు ఓవర్ల మ్యాచ్‌ ఆడించే అవకాశాలు కూడా లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 బుధవారం మొహాలి వేదికగా జరగనుంది.

Story first published: Monday, September 16, 2019, 12:27 [IST]
Other articles published on Sep 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+