INDvsAUS : శాండ్ పేపర్ కాదుగా.. క్రికెట్ అంటే తెలీదా?.. జడేజా ఇష్యూలో ఆసీస్‌కు చురకలు!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా బాల్ ట్యాంపరింగ్ చేశాడంటూ ఆసీస్ మీడియా కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే. దీనిపై క్రికెట్ అభిమానులు ఘాటుగా స్పందించారు.
అలాగే ఈ ఘటనపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వివరణ ఇచ్చాడు. జడ్డూ వేలికి పెయిన్ రిలీఫ్ ఆయింట్‌మెంట్ రాసుకున్నాడని చెప్పారు. అయితే అతను బంతికి ఏం రాయకుండానే టాంపరింగ్ చేశాడని వార్తలు రాయడంపై ఆసీస్ మీడియా, కొందరు నిపుణులపై విమర్శలు వెల్లువెత్తాయి.

శాండ్ పేపర్ కాదుగా..
ఈ క్రమంలో కొందరు అభిమానులైతే డైరెక్ట్‌గా ఆస్ట్రేలియా జట్టుపై చురకలేశారు. జడ్డూ వేలికి ఏదో రాసుకున్న విషయం నిజమేనని, కానీ అది శాండ్ పేపర్ అయితే కాదని జోకులు వేశారు. గతంలో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా ఆసీస్ ఆటగాళ్లు శాండ్ పేపర్‌తో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. అప్పట్లో అది చాలా పెద్ద ఇష్యూ అయింది. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ తదితరులపై క్రికెట్ ఆస్ట్రేలియా కొంత కాలం నిషేధం విధించింది కూడా.

క్రికెట్ జ్ఞానం లేదా?
తాజాగా జడ్డూ విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ ఘాటుగా స్పందించాడు. అసలు ఇలాంటి కామెంట్స్ ఎవరు చేస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'జడేజా బాల్ టాంపరింగ్ చేశాడని ఆస్ట్రేలియన్ మీడియా ఆరోపిస్తోంది. అసలు ఇలా టాంపరింగ్ చేయడం వల్ల ఒక స్పిన్నర్‌కు ఏం లాభం ఉంటుంది? క్రికెట్ అంటే ఏమాత్రం జ్ఞానం లేని వాళ్లు చేసే కామెంట్లు ఇవి' అని చురకలు వేశాడు.

జడ్డూకు క్లీన్ చిట్..
మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ఇద్దరికీ జడ్డూకు సంబంధించిన ఈ క్లిప్‌ను చూపించారట. ఈ వీడియోలో సిరాజ్ నుంచి ఏదో జెల్ వంటిది తీసుకున్న జడ్డూ.. తన ఎడం చేతి చూపుడు వేలికి దాన్ని పూసుకున్నాడు. అతను తీసుకున్నది పెయిన్ రిలీఫ్ జెల్ అని రోహిత్ వివరణ ఇవ్వడంతో రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ సంతృప్తి చెందినట్లు సమాచారం. వీడియో మొత్తం చూసినా కూడా జడ్డూ తన చేతిలోని బంతికి ఏం పూయలేదని స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అతనిపై ఎలాంటి ఫిర్యాదు లేదని అంపైర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications