Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'వికెట్ కీపర్‌ను మార్చే ప్రయత్నంలో టీమిండియా'

Fans Question India's Team Selection After Opening Test Defeat Against South Africa

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ జట్టులో మార్పులు చేర్పులపై యోచిస్తోన్నట్లు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జట్టులో ప్రధాన స్థానమైన వికెట్ కీపర్‌ను మార్చాల్సిందేనా అనే విషయంపై సుదీర్ఘ ఆలోచనలో పడింది.

సెంచూరియన్ వేదికగా జనవరి 13 శనివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. శనివారం నుంచి జరగనున్న రెండో టెస్టుకి జట్టులో ఈ మార్పులు కనిపించనున్నాయి. తొలి టెస్టులో బౌలర్లు చివర వరకు పోరాడి తమ సత్తా చాటారు. కానీ, బ్యాట్స్‌మెన్‌ల ఆటతీరు మాత్రం సగటు అభిమానిని నిరుత్సాహపరిచింది.

ముఖ్యంగా 208 పరుగుల లక్ష్య ఛేదనలో ఏ మాత్రం పోరాట పటిమ చూపలేకపోయారు. దీంతో 72 పరుగుల తేడాతో సఫారీ జట్టు తొలి టెస్టును అలవోకగా చేజిక్కుంచుకుంది.

టెస్టుల నుంచి భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సుదీర్ఘకాలంగా టెస్టు జట్టులో వికెట్ కీపర్‌గా సాహా ఉంటున్నాడు. తొలి టెస్టులో ఘోరంగా సాహా క్యాచ్‌లు పట్టి ధోనీ రికార్డును దాటేసినా బ్యాటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలో చేయలేకపోయాడు.

సాహా తొలి ఇన్నింగ్స్‌లో 8 బంతులు ఎదుర్కొని డకౌటైయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలక సమయంలో 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కుచేరుకున్నాడు. దీంతో అతని బ్యాటింగ్ ఫామ్‌ను పరిగణనలోకి తీసుకున్న మేనేజ్‌మెంట్ అతనిని స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్‌కు అవకాశమివ్వాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో పార్థీవ్ పటేల్ చాలాసేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. 2016లో చివరిసారి పార్థీవ్ పటేల్ భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 10, 2018, 17:44 [IST]
Other articles published on Jan 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+