న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇదేం పద్దతి ఐసీసీ.. ధోనీ బలిదాన్ బ్యాడ్జ్ వద్దని ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌‌’కు అనుమతా?

Fans Question ICC For Allowing West Indies Players To Wear Black Lives Matter Logo over MS Dhoni Balidan Badge

లండన్‌: అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యానంతరం 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' పేరుతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు జాతివివక్షకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించారు. ఇప్పుడు క్రికెట్‌ మైదానంలో దానికి సంఘీభావం తెలిపేందుకు వెస్టిండీస్‌ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. జూలై 8 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టులో విండీస్‌ క్రికెటర్లు తమ జెర్సీ కాలర్‌పై 'బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' అని ముద్రించిన లోగోతో బరిలోకి దిగనున్నారు.

జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగమయ్యేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) విండీస్‌ జట్టుకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. విండీస్‌ ఆటగాళ్లు ధరించబోయే లోగోను అలీషా హోసానా డిజైన్‌ చేయగా... ఇటీవల మళ్లీ ప్రారంభమైన ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో 20 జట్ల ఆటగాళ్లు ఈ లోగోను ధరించారు. సరిగ్గా ఆ లోగోకే ఐసీసీ అనుమతి ఇచ్చింది. అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మిమర్శలు వస్తున్నాయి.

ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు

‘ఐసీసీ క్లాతింగ్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ నిబంధనల ప్రకారం రాజకీయ, మతపరమైన, జాతి వివక్షకు సంబంధించిన సందేశాలు ఎలాంటివి కూడా ఆటలో ప్రదర్శించేందుకు అనుమతి లేదు'. ఇలా ఐసీసీ తమ నిబంధనల్లో స్పష్టంగా చెప్పింది. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్‌ ధోని తన వికెట్‌ కీపింగ్‌ గ్లవ్స్‌పై డాగర్‌ గుర్తు ముద్రించి ఉన్న ‘బలిదాన్‌ బ్యాడ్జ్‌'ను ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

దానిని తర్వాతి మ్యాచ్‌ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంది. అంతకుముందు భారత్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ ‘ఫ్రీ పాలస్తీన్, సేవ్‌ గాజా' అంటూ రిస్ట్‌ బ్యాండ్‌ ధరించగా రిఫరీ డేవిడ్‌ బూన్‌ తీసేయించారు. ఇంగ్లండ్‌ బోర్డు దానిని రాజకీయపరమైంది కాదు మానవత్వానికి సంబంధించి అని మొయిన్‌ అలీని సమర్థించినా ఐసీసీ అంగీకరించలేదు.

ఇదెలా భిన్నమో చెప్పాలి

ఇప్పుడు ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' వీటికి ఎలా భిన్నమో ఐసీసీనే చెప్పాలని భారత అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎలా చూసుకున్నా తాజా అమెరికా అంశానికి కూడా ఆటలతో సంబంధం లేదని, వ్యక్తిగతంగా బయట ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా.. మైదానంలోకి వచ్చేసరికి ఏ క్రీడలోనైనా అంతా ఒక్కటే అంటూ బరిలోకి దిగడం ప్రాథమిక స్ఫూర్తని అభిప్రాయపడుతున్నారు. ఇక తాము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తలేమని, కానీ ధోనీ విషయంలో ఎందుకు అంత మొండిగా వ్యవహరించారని మండిపడుతున్నారు.

ఈ పరిణామాలపై ఐసీసీ స్పందిస్తూ ‘నిబంధనల ప్రకారం అన్నింటిని ఒకే లెక్కన కట్టకుండా తమ విచక్షణ మేరకు ఆయా సందర్భానుసారం నిబంధనల విషయంలో కాస్త సడలింపు ఇస్తాం' అని ప్రకటించింది. ఇక నల్లవారితోనే నిండిన వెస్టిండీస్‌ ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌' అంటూ సంఘీభావం తెలపడం కంటే శ్వేత జాతీయులతో నిండిన ఇంగ్లండ్‌ టీమ్‌ అలా చేసి ఉంటే భిన్నంగా ఉండేదేమోనని సోషల్ మీడియావేదికగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

రిస్క్ లేకుండా రీస్టార్ట్

కరోనా కారణంగా మార్చి నుంచి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ఆగిపోయింది. ఇప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ‘బయో సెక్యూర్‌ బబుల్‌' వాతావరణంలో వెస్టిండీస్‌కు సొంతగడ్డపై ఆతిథ్యం ఇచ్చేందుకు ఇంగ్లండ్‌ బోర్డు సిద్ధమైంది. విరామం తర్వాత జరగనున్న తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఇదే కానుంది. జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం గురించి ప్రచారం చేసే, దానికి సంఘీభావం తెలిపే బాధ్యత తమకుందని భావిస్తున్నట్లు వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్టర్ తెలిపాడు.

2007 టీ20 ప్రపంచకప్ ఆడకుండా ఆ ఇద్దరిని ద్రవిడ్ ఒప్పించాడు: లాల్‌చంద్ రాజ్‌పుత్

Story first published: Tuesday, June 30, 2020, 9:10 [IST]
Other articles published on Jun 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X