Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL : నోరు అదుపులో ఉండదా?.. పృథ్వీ షా కామెంట్స్‌పై ఫ్యాన్స్ ఫైర్!

Fans not happy with Prithvi Shaw rude remarks

రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడుతూ తన పేరిట అరుదైన రికార్డు నమోదు చేసుకున్న పృథ్వీ షా.. అనవసర కామెంట్స్‌తో తన కెరీర్‌కు నష్టం చేసుకుంటున్నాడు. అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో 379 పరుగులో రాణించిన అతను.. రంజీ ట్రోఫీలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు సృష్టించాడు. ఇదే జోరులో 400 పరుగులు చేసేస్తాడని అంతా అనుకున్నారు. అయితే అస్సాం స్టార్ రియాన్ పరాగ్ వేసిన 124వ ఓవర్ తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.

పృథ్వీ షా ఇంగ అద్భుతమైన ప్రదర్శన చేయడంతో బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా అతన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. దీంతో అభిమానులు కూడా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇలాంటి సమయంలో పృథ్వీ షా అనవసరంగా నోరు పారేసుకున్నాడు. అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో తను అవుట్ కాదని, 400 పరుగుల మైలు రాయి చేరుకోవాలని అనుకున్నానని చెప్పాడు. తను అవుట్ అయినట్లు ఇచ్చిన అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు.

'నేను అవుట్ కాదు. కచ్చితంగా 400 పరుగులు చేసేవాడిని. ఆ మైలురాయి చేరుకుంటే ఆ సంతోషమే వేరు. నేను అద్భుతంగా బ్యాటింగ్ చేశానని అనుకుంటున్నా. ఇటీవలి కాలంలో బాగా బ్యాటింగ్ చేస్తున్నా భారీ స్కోర్లు చేయలేకపోయా. దీంతో ఇలాంటి ఇన్నింగ్స్ ఒకటి కచ్చితంగా ఆడతానని నాకు తెలుసు. అందుకే క్రీజులో నాకంటూ మరికొంత సమయం తీసుకొని, ఓర్పుతో ఆడాలని నిర్ణయించుకున్నా. పిచ్ కూడా అలాగే ఉంది' అని తన ఇన్నింగ్స్‌ను వివరించాడు. పృథ్వీ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ అతని సెలెక్షన్‌పై నీలి నీడలు కమ్ముకున్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో నిర్లక్ష్యపు కామెంట్స్ చేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

Story first published: Friday, January 13, 2023, 11:15 [IST]
Other articles published on Jan 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+