Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : నీ కన్నా వంద రెట్లు నయం.. టీమిండియా మాజీ లెజెండ్‌పై మండిపడుతున్న నెటిజన్లు!

 Fans not happy with Harbhajan Singh comments on Ashwin

భారత క్రికెట్‌లో బెస్ట్ స్పిన్నర్లలో హర్భజన్ సింగ్ ఒకడు. అయితే అతను కొన్నిసార్లు చేసే కామెంట్లు వివాదాలకు దారి తీసి, భజ్జీపై గౌరవాన్ని తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా కాలం మారే కొద్దీ కొత్త ఆటగాళ్లు వచ్చే కొద్దీ పాత వాళ్ల రికార్డులు బద్దలవడం పరిపాటే. భజ్జీ విషయంలో కూడా అదే జరిగింది. భజ్జీ నెలకొల్పిన ఎన్నో రికార్డులను ఆ తర్వాత వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ బద్దలు కొట్టాడు. కానీ దీన్ని భజ్జీ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాడు. తాజాగా అతను చేసిన కామెంట్లే దీనికి ఉదాహరణ.

ఆసీస్‌కు అశ్విన్ భయం..

ఆసీస్‌కు అశ్విన్ భయం..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఎలాగైనా గెలవాలని ఆస్ట్రేలియా జట్టు గట్టిగా ప్రయత్నిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే అశ్విన్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కోసం ఆసీస్ బ్యాటర్లు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అశ్విన్ చేసినట్లు బౌలింగ్ చేసే మహేష్ పితియా అనే స్పిన్నర్‌ను నెట్ బౌలర్‌గా చేర్చుకొని మరీ ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. దీనిపై టీమిండియా మాజీ లెజెండ్ వసీం జాఫర్ వైరల్ కామెంట్స్ చేశాడు.

భజ్జీ కామెంట్స్

భజ్జీ కామెంట్స్

ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్ల బుర్రలో ఇప్పటికే అశ్విన్ ఉన్నాడని, అతన్ని ఎలా ఎదుర్కోవాలని వాళ్లు ఇలా కఠోర సాధన చేస్తున్నారని జాఫర్ అన్నాడు. 'ఆసీస్ ఆటగాళ్ల బుర్రలో ఇప్పటికే అశ్విన్ చేరాడన్నమాట' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే హర్భజన్ మాత్రం ఈ కామెంట్‌ను మెచ్చుకోలేదు. స్పిన్ పిచ్‌ ఫొటో తీసి దాన్ని షేర్ చేశాడు. 'ఆసీస్ వాళ్ల బుర్రలో ముందుగా ఉంది ఇది' అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ తగిలించాడు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు మండిపడుతున్నారు. ఇది కచ్చితంగా అశ్విన్‌ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్సే అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మండిపడుతున్న ఫ్యాన్స్..

మండిపడుతున్న ఫ్యాన్స్..

అశ్విన్ ఎప్పుడు హర్భజన్ గురించి మాట్లాడినా చాలా గౌరవం ఇస్తాడని, కానీ భజ్జీ మాత్రం ఇలాంటి కామెంట్స్ చేయడం బాధాకరమని కొందరు అంటున్నారు. మరికొందరేమో 'నీ కన్నా అశ్విన్ వంద రెట్లు బెటర్ బౌలర్. అందుకే నీకు కుళ్లు' అంటూ భజ్జీని తిట్టిపోస్తున్నారు. భజ్జీ షేర్ చేసిన స్పిన్ పిచ్‌లపై అతనే రాణించలేదని, ఇప్పుడు అశ్విన్ రాణిస్తుంటే ఓర్వలేకపోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. తన రికార్డులన్నీ బద్దలవుతుంటే భజ్జీ భయపడి పోతున్నాడని, ఆసీస్ ఆటగాళ్ల కన్నా కూడా భజ్జీనే అశ్విన్ ఎక్కువ భయపెడుతున్నాడని అంటున్నారు.

Story first published: Sunday, February 5, 2023, 20:05 [IST]
Other articles published on Feb 5, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+