
నాగ్‌పూర్ టెస్టులో..
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో అద్భుతమైన స్పిన్ పిచ్‌ను తయారు చేశారు. అంత టర్న్ అవుతున్న పిచ్‌పై భారత ఆటగాళ్లు రాణించినా ఆసీస్ బ్యాటర్లు మాత్రం తడబడ్డారు. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ 130పైగా పరుగుల తేడాతో విజయం సాధించింది. జడేజా, అశ్విన్ ఇద్దరూ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆసీస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఈ మ్యాచ్ చూసిన తర్వాత ఆసీస్ మీడియా నిప్పులు కక్కింది. భారత్ కావాలనే ఆసీస్ బ్యాటర్లను టార్గెట్ చేస్తూ ఈ పిచ్ తయారు చేసిందని ఆరోపణలు చేసింది.

రెండో టెస్టులో కూడా..
ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో కూడా భారత బౌలర్లు చెలరేగారు. ఇక్కడ కూడా స్పిన్‌కు సహకరించే పిచ్‌నే తయారు చేశారు. అయితే ఆసీస్ స్పిన్నర్లు కూడా ఈ మ్యాచ్‌లో రాణించారు. దీంతో భారత బ్యాటర్లు కూడా కొంత తడబడ్డారు. కానీ ఎట్టకేలకు ఆరు వికెట్ల తేడాతో ఆసీస్‌పై విజయం సాధించారు. ఈ మ్యాచ్ జరిగినప్పుడు కూడా భారత్ తయారు చేసి పిచ్‌పై విమర్శలు వచ్చాయి. కానీ ఆటగాళ్ల సత్తా గురించి మాట్లాడాలని, పిచ్ గురించి వాగడం అనవసరమని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరాఖండీగా చెప్పేశాడు.

బెడిసికొట్టిన ఇండోర్..
వరుసగా రెండు టెస్టులు గెలిచిన జోరులో మూడో టెస్టులో కూడా భారత్ స్పిన్ పిచ్ తయారు చేసింది. కానీ ఇక్కడ ఆసీస్ కెప్టెన్ మారడంతో ఈ వ్యూహం బెడిసికొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ను స్టీవెన్ స్మిత్ తన అద్భుతమైన బౌలింగ్ మార్పులతో దెబ్బతీశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఖవాజా, ట్రావిస్ హెడ్ తదితరులు ఫర్వాలేదనిపించారు. దీంతో ఈ టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడింది. అప్పుడు కూడా ఇలాంటి పిచ్‌లపై ఆడాలని టీం మేనేజ్‌మెంట్ నిర్ణయించుకుందని, అందుకే ఈ పిచ్‌లు తయారు చేస్తున్నామని రోహిత్ చెప్పాడు.

చివరి టెస్టులో ఏం చేస్తారు?
వరుసగా మూడు టెస్టుల్లో స్పిన్ పిచ్ తయారు చేయించిన భారత్.. నాలుగో టెస్టులో ఏం చేస్తుందని అంతా ఆసక్తిగా ఉన్నారు. చివరి మ్యాచ్‌లో అయినా భారత్ గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో పిచ్ గురించి భారత జట్టు మేనేజ్‌మెంట్ ఎలాంటి ఇన్‌పుట్స్ ఇవ్వలేదట. దీంతో సాధారణంగా ఇక్కడ తయారు చేసే పిచ్‌నే రెడీ చేస్తున్నామని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు అంటున్నారు. ఇక్కడ ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. దీంతో భారత్, ఆస్ట్రేలియా టెస్టులో కూడా పరుగుల వరద ఖాయమని, ఈ మ్యాచ్ ఐదు రోజులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












