RCBvsMI : ముంబై-విండీస్.. అదో లవ్ స్టోరీ.. హేలీ మాథ్యూస్‌పై నెటిజన్ల మీమ్స్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన డబ్ల్యూపీఎల్ మ్యాచులో ముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. తొలుత బౌలింగ్ చేసిన ముంబై.. ఆర్సీబీని కేవలం 155 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌లో విండీస్ స్టార్ హేలీ మాథ్యూస్ (77 నాటౌట్) చెలరేగడంతో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఈ మ్యాచ్ గెలిచింది. అంతకుముందు బౌలింగ్‌లో కూడా మాథ్యూస్ అద్భుతంగా రాణించింది. మూడు కీలక వికెట్లు తీసుకుంది.
బౌలింగ్‌లోనూ టాప్ పెర్ఫామెన్స్..
ఆర్సీబీలో కీలకమైన స్మృతి మంధాన, రిచా ఘోష్, హెదర్ నైట్ ముగ్గుర్నీ హేలీ మాథ్యూస్ అవుట్ చేసింది. దీంతో ఆ జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. చివర్లో శ్రేయాంక, మేగన్ షూట్ పోరాడటంతో 18.4 ఓవర్లలో 155 పరుగులు చేసిందా జట్టు. ఈ ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ముందుకొచ్చిన షూట్ స్టంపౌట్ అయింది. దీంతో ఆర్సీబీ ఆలౌట్ అయింది. ఓ మోస్తరు లక్ష్యంతో బరిలో దిగిన ముంబైకి మంచి ఆరంభం లభించింది. యాస్తికా భాటియా (23) ఫర్వాలేదనిపించింది. అయితే మరో ఓపెనర్ హేలీ మాథ్యూస్ (38 బంతుల్లో 77 నాటౌట్) అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడింది.
ఈజీగా ఛేజ్ చేసిన ముంబై..
యాస్తికా అవుటైన తర్వాత వచ్చిన నాట్ సివర్ బ్రంట్ (29 బంతుల్లో 55 నాటౌట్) కూడా ఆకాశమే హద్దుగా చెలరేగింది. దీంతో ముంబై జట్టు సులభంగా విజయతీరాలకు చేరింది. కేవలం 14.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ నష్టపోయి టార్గెట్ ఛేజ్ చేసేసింది. ఇది చూసిన అభిమానులు హేలీ మాథ్యూస్ ఆటతీరుకు ఫిదా అయిపోయారు. ఈ విండీస్ సుందరి ఆట చూసిన వాళ్లకు ఐపీఎల్‌లో కీరన్ పొలార్డ్ గుర్తొచ్చాడు. పొలార్డ్ కూడా ముంబైకి ఇలాగే ఎన్నో మరపురాని విజయాలు అందించాడు.
ఫిదా అయిపోయిన ఫ్యాన్స్..
ఈ విషయం గుర్తుచేసుకున్న నెటిజన్లు.. 'ముంబైకి, విండీస్‌కి మధ్య ఈ లవ్ స్టోరీ కంటిన్యూ అవుతూనే ఉంది' అంటూ కామెంట్లు చేస్తున్నారు. సరిగ్గా పదేళ్ల క్రితం ముంబై ఇండియన్స్‌ను చీర్ చేస్తూ ఆమె చేసిన ట్వీట్‌ను కూడా నెటిజన్లు తవ్వితీశారు. 'పదేళ్ల క్రితం సపోర్ట్ ఇచ్చి, ఇప్పుడు అదే జట్టును ఒంటిచేత్తో గెలిపిస్తున్న హేలీ' అంటూ మెచ్చుకుంటున్నారు. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న ఆమె.. డబ్ల్యూబీబీఎల్, ది హండ్రెడ్, డబ్ల్యూపీఎల్, డబ్ల్యూసీపీఎల్ టోర్నీలు అన్నింటిలో ఈ అవార్డు అందుకున్న ఏకైక ప్లేయర్ అంటూ కొనియాడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications