For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: క్రికెట్‌లో ‘నవరసాలు’.. వన్డే వరల్డ్ కప్ ట్రైలర్ రిలీజ్ చేసిన ఐసీసీ!

వన్డే వరల్డ్ కప్‌కు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ఒక ట్రైలర్ విడుదల చేసింది. 'ఇట్ టేక్స్ వన్ డే' పేరుతో విడుదల చేసిన ఈ వరల్డ్ కప్ ట్రైలర్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు వరల్డ్ కప్‌లలో జరిగిన పలు కీలక సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు. వీటన్నింటికీ బ్యాక్‌గ్రౌండ్‌లో షారుఖ్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

ఈ వీడియోను 'నవరసాలు' కాన్సెప్ట్‌లో తీర్చిదిద్దినట్లు ఐసీసీ తెలిపింది. మనుషులకు ఉండే తొమ్మిది ఎమోషన్స్‌ను.. వరల్డ్ కప్ సమయంలో ఫ్యాన్స్ ఎలా ఎక్స్‌పీరియన్స్ చేస్తారో ఈ వీడియోలో చూపించారు. అలాగే దాదాపు క్రికెట్ ఆడే దేశాలు అన్నింటినీ ఈ వీడియోలో రిప్రజెంట్ చేశారు. వీడియో చివర్లో కింగ్ ఖాన్ షారుఖ్‌.. వరల్డ్ కప్‌తో కనిపించాడు. అన్ని కలలు ఒక్క రోజులో తీరే వరల్డ్ కప్‌కు టైం వచ్చేసిందని షారుఖ్ చెప్పాడు.

ICC shares an interesting trailer for ICC ODI World Cup 2023

ఈ సందర్భంగా వరల్డ్ కప్‌తో షారుఖ్ ఉన్న ఫొటోను కూడా ఐసీసీ షేర్ చేసింది. 'కింగ్ ఖాన్ విత్ ట్రోఫీ.. అది దాదాపు ఇక్కడకు వచ్చేసింది' అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటో చూసిన షారుఖ్ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. 'కనీసం వార్నింగ్ ఇవ్వకుండా ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేస్తే.. మా ఫ్యాన్స్ గుండెలకు ఏం కావాలి?' అని కొందరు ఐసీసీని నిలదీస్తున్నారు. మరికొందరేమో ఇక వరల్డ్ కప్ గెలవకుండా ఇండియాను ఎవరూ ఆపలేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం అవనున్న సంగతి తెలిసిందే. భారత దేశంలో మొత్తం 10 స్టేడియాల్లో ఈ మ్యాచులు జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో చివరి వన్డే వరల్డ్ కప్ ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ జట్లు తలపడతాయి. భారత జట్టు అక్టోబర్ 8న మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఢీకొంటుంది. పాకిస్తాన్‌తో అక్టోబర్ 15న తలపడుతుంది.

Story first published: Thursday, July 20, 2023, 17:55 [IST]
Other articles published on Jul 20, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+