ధోని పిలుపు: మెల్‌బోర్న్‌లో అభిమానుల కోలాహలం.... అంతా త్రివర్ణమయం
మెల్‌బోర్న్: ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కి టీమిండియా అభిమానులు పోటెత్తారు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇచ్చిన పిలుపు మేరకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.
క్వార్టర్ ఫైనల్స్‌లో రెండో మ్యాచ్‌కి వేదికైన మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ను టీమిండియా అభిమానులు జాతీయ జెండాలతో త్రివర్ణమయం చేశారు. మ్యాచ్ ప్రారంభం కాకముందే చేరుకున్న అభిమానులతో స్టేడియం మొత్తం టీమిండియా అభిమానులతో హోరెత్తిపోతుంది.

బుధవారం ప్రెస్ మీట్‌లో మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ టోర్నమెంట్లో టీమిండియా మ్యాచ్‌లకు భారీగా ప్రేక్షకులు తరలివస్తున్నారని, వారెంతో మద్దతిస్తున్నారని ధోని పేర్కొన్నాడు. అభిమానుల నుంచి ఇదే మద్దతుని క్వార్టర్ ఫైనల్స్‌లో అభిమానులు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో చూపాలని ధోని కోరిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ నేపథ్యంలో ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ భారత్-బంగ్లాదేశ్ గురించి గూగుల్ పేజిల్లో ప్రత్యేక గూగుల్ డూడుల్‌ను ఏర్పాటు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications