For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

20 సిక్స్‌లు.. 'హార్దిక్‌.. హార్దిక్‌' అంటూ స్టేడియాన్ని హోరెత్తించిన ఫాన్స్ (వీడియో)!!

Fans Invade Pitch After Hardik Pandyas hits 158 from 55 balls

ముంబై: వెన్ను గాయంతో సుదీర్ఘ కాలం విశ్రాంతి తీసుకున్న టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా 'రీ ఎంట్రీ' దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న పాండ్యా ప్రస్తుతం పూనకం వచ్చినట్లే ఆడుతున్నాడు. దేశవాళీ టోర్నీలో భాగంగా డివై పాటిల్‌ టీ20 కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. గత మంగళవారం 39 బంతుల్లో 105 పరుగులు చేసిన హార్దిక్‌.. శుక్రవారం బీపీసీఎల్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో తన విశ్వరూపం ప్రదర్శించాడు.

20 సిక్స్‌లు, 6 ఫోర్లు:

రిలయన్స్‌ వన్‌ జట్టు తరఫున ఆడుతున్న హార్దిక్ పాండ్యా 55 బంతుల్లోనే 20 సిక్స్‌లు, 6 ఫోర్లతో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఏకంగా 20 సిక్స్‌లు బాది ప్రత్యర్థి బౌలర్లను హడలెత్తించాడు. టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత ఆటగాడిగా హార్దిక్ నిలిచాడు. పాండ్యా విధ్వంసంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన రిలయన్స్‌ వన్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష ఛేదనలో బీపీసీఎల్‌ 134 పరుగులకే ఆలౌటవడంతో.. రిలయన్స్‌ 104 పరుగుల తేడాతో విజయం సాధించింది.

స్టేడియంలో హార్దిక్‌ నామస్మరణ:

స్టేడియంలో హార్దిక్‌ నామస్మరణ:

మ్యాచ్‌ అనంతరం డీవై పాటిల్‌ స్టేడియంలో ఫాన్స్ సందడి చేసారు. 'హార్దిక్‌.. హార్దిక్‌' అంటూ స్టేడియాన్ని ఒక్కసారిగా హోరెత్తించారు. స్టేడియంలోకి దూసుకొచ్చిన వేల సంఖ్యలో ఫాన్స్ హార్దిక్‌ నామస్మరణ చేసారు. కొంతమంది ఫ్యాన్స్‌ అయితే డ్రెస్సింగ్‌ రూమ్‌కు వద్దకు వెళ్లి మరీ హార్దిక్‌ అంటూ అరిచారు. ఆడింది దేశవాళీ మ్యాచ్‌ అయినా.. పాండ్యా సిక్సులతో అలరించడంతో ఫాన్స్ ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

 పరిస్థితిని బట్టి బ్యాట్‌ ఝుళిపించా:

పరిస్థితిని బట్టి బ్యాట్‌ ఝుళిపించా:

మ్యాచ్‌ అనంతరం హార్దిక్‌ పాండ్యా మాట్లాడుతూ... 'ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి ఇదొక మంచి ప్లాట్‌ఫామ్‌. గాయం నుండి కోలుకున్న నా శరీరం ఎలా ఉందో పరీక్షించుకోవడానికి ఇది ఒక మంచి సువర్ణావకాశం. ఈ టోర్నీలో ఎలా ఆడాలని సిద్ధమయ్యానో దాన్ని నిజం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇందు కోసం ముందస్తు ప్రణాళిక ఏమీ లేదు. క్రీజ్‌లోకి దిగిన తర్వాత పరిస్థితిని బట్టి బ్యాట్‌ ఝుళిపించా' అని తెలిపాడు.

అయ్యర్‌ రికార్డు బద్దలు:

అయ్యర్‌ రికార్డు బద్దలు:

158 పరుగులు చేసి టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డును హార్దిక్‌ పాండ్యా నమోదు చేశాడు. అంతకుముందు టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత క్రికెటర్‌ రికార్డు శ్రేయస్‌ అయ్యర్‌ పేరిట ఉండేది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో అయ్యర్‌ 147 పరుగులు చేసాడు. ఇప్పుడు ఆ రికార్డును హార్దిక్‌ బ్రేక్‌ చేశాడు.

పాండ్యకు పిచ్చెక్కిందా?:

పాండ్యకు పిచ్చెక్కిందా?:

మైదానంలో సిక్సర్ల మోత మోగిస్తున్న పాండ్యాపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే కొందరు ఫాన్స్ ప్రశంసలతో పాటు పంచ్‌లు కూడా విసురుతున్నారు. 'పాండ్యకు పిచ్చెక్కిందా.. ఇలా ఆడుతున్నాడు' అని ఓ ఫ్యాన్ సరదాగా ట్వీట్ చేసాడు. 'ఇది నిజమని తెలియదు. ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుంది. నేను త్వరలో వివాహం చేసుకోవాలి' అని ఓ అభిమాని పంచ్ ఇచ్చాడు.

Story first published: Saturday, March 7, 2020, 20:12 [IST]
Other articles published on Mar 7, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+